తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో కాంగ్రెస్ (Congress) ఉంది. అందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తూ..పక్క ప్రణాళికతో ఎన్నికల ప్రచారం చేస్తుంది. ఇప్పటీకే ఆరు గ్యారెంటీ హామీలతో ప్రజల్లోకి వెళ్లగా..ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. అంతే కాదు ఈరోజు గురువారం కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్‌ను ప్రకటించనుంది. ఇప్పటికే యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఎస్సీ.. ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు మైనార్టీ (Minority Declaration) ప్రకటించేందుకు సిద్ధమైంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు సాయంత్రం నాంపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy), సీడబ్ల్యూసీ సభ్యులు సల్మాన్ ఖుర్షీద్, నాసిర్ హుస్సేన్, ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి తదితరులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల ఆర్థిక అభ్యున్నతికి తీసుకునే అంశాలపై డిక్లరేషన్‌లో పొందుపర్చనున్నారు. తెలంగాణలో మైనార్టీ జనాభా 14 శాతంగా ఉండగా.. 40 నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఉండనుంది. మైనార్టీల జనాభా ప్రకారం వారి స్థితిగతులపై అధ్యయనం చేసింది కాంగ్రెస్. జనాభా నిష్పత్తిలో బడ్జెట్‌ను కేటాయించడానికి మైనారిటీల కోసం సబ్-ప్లాన్ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వనుంది. ముస్లిం సమాజానికి మెరుగైన ఆరోగ్యం, విద్యను అందించడానికి, వారి జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు స్కూళ్లను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వివరించనుంది.
మైనార్టీ డిక్లరేషన్ (Minority Declaration) లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులకు ఉచిత విద్యుత్, నిరుపేద కుటుంబాల ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం , ముస్లిం విద్యార్థుల ఉన్నత చదువుల కోసం విదేశీ విద్య కింద 20 లక్షలు , మసీదుల్లో ఇమామ్‌లు, మౌజన్‌లందరికీ నెలవారీ గౌరవ వేతనం ఆరు వేలు వంటివి ఈ డిక్లరేషన్ లో పొందుపరిచారు.
Read Also : IT Rides : తనను భయపెట్టి, ఇబ్బంది పెట్టేందుకు ఐటీ రైడ్స్ – పొంగులేటి