T-Congress Manifesto 2023 : రేపు అదిరిపోయే మేనిఫెస్టో ను రిలీజ్ చేయబోతున్న కాంగ్రెస్

అలాగే ధరణి స్థానంలో భూభారతి అనే విధానాన్ని తీసుకరాబోతున్నారు. ధరణిలో ఉన్న లోపాలన్నింటనీ సవరిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది

Published By: HashtagU Telugu Desk
T Congress Manifesto 2023

T Congress Manifesto 2023

తెలంగాణ ఎన్నికల (Telangana Assembly Election 2023) పోరులో విజయం ఫై ధీమాగా ఉన్న కాంగ్రెస్..ప్రచారంలో దూకుడు కనపరుస్తుంది. ఓ పక్క ప్రచారం చేస్తూనే..మరోపక్క అధికార పార్టీ (BRS) ఫై విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటె రేపు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ (Congress Party) అసలు సిసలైన మేనిఫెస్టో (T-Congress Manifesto 2023) ను రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు (Congress 6 Guarantees ) అంటూ హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో వీటి గురించే ప్రధానంగా వివరిస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు మరిన్ని హామీలు అందించేందుకు సిద్ధమైంది.

రేపు హైదరాబాద్ కు రాబోతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ( Mallikarjoun Kharge ) మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇప్పటికే పేదలకు పెళ్లిళ్లకు సాయం కింద రూ. లక్ష వరకూ నగదు ఇస్తున్నారు. ఆ నగదుతో పాటు ఇక నుంచి తులం బంగారం ( Gold ) ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో తెలుపుకున్నారు. అలాగే ధరణి (Dharani) స్థానంలో భూభారతి (Bhubharathi) అనే విధానాన్ని తీసుకరాబోతున్నారు. ధరణిలో ఉన్న లోపాలన్నింటనీ సవరిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత కల్పించే ఆలోచన చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే గ్రామ వార్డుసభ్యులకు గౌరవ వేతనం, రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటుగా కమిషన్ గురించి స్పష్టమైన హీమ ఇవ్వబోతున్నారు. అభయ హస్తం పథకం తిరిగి పునరుద్దరించనున్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డుల పై హామీ ఇవ్వనుంది. అమ్మహస్తం పేరుతో 9 నిత్యావసరాల వస్తువుల పంపిణీకి మేనిఫెస్టో ప్రస్తావన చేయనుంది. ఎంబీసీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు పైన స్పష్టత ఇవ్వనున్నారు. రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇవ్వనున్నట్లు మేనిఫెస్టో లో చెప్పనున్నారు. ఇవేకాక మరిన్ని ఆకట్టుకునే హామీలను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయితే ఇక తిరుగుండదు.

Read Also : TS Polls : రంగంలోకి దిగిన సోనియా..పీసీసీకి కీలక ఆదేశాలు

  Last Updated: 16 Nov 2023, 08:19 PM IST