Site icon HashtagU Telugu

Telangana : టీ కాంగ్రెస్ లో మొదలైన అసమ్మతి సెగలు..విష్ణువర్ధన్ రాజీనామా ..?

T Congress Leaders Fires On

T Congress Leaders Fires On

టీ కాంగ్రెస్ (T COngress) లో మరోసారి అసమ్మతి సెగలు మొదలయ్యాయి. శుక్రవారం అధిష్టానం 45 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను (Congress Second List ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఎప్పటి నుండో టికెట్ కోసం ఎదురుచూస్తున్న వారిలో కొంతమందికి టికెట్ రాకపోయేసరికి వారంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ని నమ్ముకొని ఉన్న మమ్మల్ని కాదని..కొత్తగా వచ్చిన వారికీ టికెట్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం రేయి పగలు కష్టపడుతుంది మీము..ఈ పార్టీ కాదని వెళ్లి, మళ్లీ ఎన్నికల సమయానికి పార్టీ లో చేరిన వారికీ టికెట్ ఇవ్వడం ఏంటి..? ఇతర పార్టీ నుండి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన వారికీ ఇవ్వడం ఏంటి..? అని వారంతా వాపోతూ.. పార్టీ అధినాయకత్వంతో తాడోపేడో తేల్చుకుంటామంటూ ప్రకటిస్తున్నారు.

మునుగోడులోనూ అసమ్మతి భగ్గుమన్నది. రెండు రోజుల క్రితమే పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (Rajagopal Reddy)కి టికెట్‌ కేటాయించడంతో.. చలమల కృష్ణారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. చౌటుప్పల్‌లో నేడు తన అనుచరులతో సమావేశమవనున్నారు. నియోజకవర్గం పరిధిలోని సంస్థాన్‌నారాయణపురం మండలం గుజ్జలో కృష్ణారెడ్డి వర్గీయులు రాజగోపాల్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. హుస్నాబాద్‌ టికెట్ల కేటాయింపు చిచ్చురాజేసింది. టికెట్‌ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల లేదా నారాయణపేటల్లో సీటు ఆశించిన ఎర్రశేఖర్‌.. తనకు పోటీచేసేందుకు అవకాశం కల్పించకపోవడం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మరికాసేపట్లో తన అనుచరుగణంతో సమావేశం కానున్నారు. వనపర్తిలో చిన్నారెడ్డికి టికెట్‌ రావడంతో మేఘారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. దేవరకద్ర టికెట్‌ ఆశించిన ప్రదీప్‌కుమార్‌ గౌడ్‌కు భంగపాటు తప్పలేదు. అక్కడ మదన్‌రెడ్డికి పార్టీ టికెట్‌ ఇచ్చింది. కామారెడ్డి కాంగ్రెస్‌లో అసంతృప్తి నెలకొన్నది. ఆ పార్టీ సీనియర్‌ నేత సుభాష్‌ రెడ్డి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఆయనను కాదని మదన్‌మోహన్‌ రావుకు అధిష్ఠానం సీటు కేటాయించడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇటు జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణు సైతం పార్టీ కి రాజీనామా చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇక్కడ మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను పార్టీ బరిలోకి దింపింది. మహేశ్వరం టికెట్‌ తనదేనంటూ ఇన్నాళ్లూ నమ్మకంగా చెబుతూ వస్తున్న పారిజాత నర్సింహారెడ్డికి నిరాశే ఎదురయింది. తనకు సీటు దక్కకపోవడంతో ఆమె తన అనుచరులతో సమావేశమవుతున్నారు. ఎల్బీనగర్‌లో ఇన్నాళ్లుగా పనిచేస్తున్న తనను కాదని నాన్‌లోకల్‌ మధు యాష్కికి టికెట్‌ ఇవ్వడంతో మల్‌రెడ్డి రాంరెడ్డి అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కూకట్‌పల్లిలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. బండి రమేష్‌కు టికెట్‌ కేటాయించడంతో స్థానిక నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలా ఇక్కడ , అక్కడ అనే కాకుండా చాల చోట్ల ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మరి వీరంతా పార్టీ లో కొనసాగుతారా..? లేక వేరే పార్టీ లో చేరతారా..? అనేది చూడాలి.

కొత్తగా పార్టీ లో చేరి టికెట్ దక్కించుకున్న వారు వీరే..

  1. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి
  2. ఆసిఫాబాద్ – శ్యామ్ నాయక్
  3. ముతోల్ – నారాయణ పటేల్
  4. కూకట్ పల్లి – బండి రమేష్
  5. శేరిలింగంపల్లి – జగదీష్ గౌడ్
  6. తాండూరు – మనోహర్ రెడ్డి
  7. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – వెన్నెల
  8. మహబూబ్ నగర్ – ఎన్నం శ్రీనివాస్ రెడ్డి
  9. మునుగోడు – రాజ్ గోపాల్ రెడ్డి
  10. పాలకుర్తి – యశశ్విని
  11. పరకాల – రేవూరి ప్రకాష్ రెడ్డి
  12. వర్ధన్నపేట -నాగరాజు
  13. ఖమ్మం – తుమ్మల నాగేశ్వర్ రావు
  14. పాలేరు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  15. పినపాక – పాయం వెంకటేశ్వర్లు