Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి

Revanth Bharat Jodo

Revanth Bharat Jodo

జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)ను ఆదివారం ప్రారంభించారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి మొదలైన పాదయాత్ర ముగింపు సంకేతంగా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రియాంక గాంధీ, ఎంపీ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా పాదయాత్ర చివరి అంకంలో రాహుల్ వెంట నడిచారు. ఇక పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం ఎస్‌కే స్టేడియంలో ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

Also Read: Antarctica: అంటార్కిటికాలో ఎగిరిన పర్యావరణ స్ఫూర్తి పతాకం

రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద భారత్ జోడో ముగింపు కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, టిపిసిసి నాయకులు చామల కిరణ్ రెడ్డి, తదితరులు కూడా పాల్గొన్నారు. లాల్ చౌక్ తర్వాత నగరంలోని బౌలేవార్డ్ ప్రాంతంలోని నెహ్రూ పార్కు వరకు యాత్ర సాగనుంది.