T Congress : కోమ‌టిరెడ్డి సీఎం `రేస్`, యాత్ర‌కు సిద్ధం

కాంగ్రెస్ పార్టీ (T Congress)ఎంపీ, స్టార్ క్యాంపెయిన‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి (Komatireddy )స్ట్రాట‌జీ మార్చేశారు.

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 03:28 PM IST

కాంగ్రెస్ పార్టీ (T Congress)ఎంపీ, స్టార్ క్యాంపెయిన‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి (Komatireddy )స్ట్రాట‌జీ మార్చేశారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విను ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ప‌ద‌వి తానంత‌ట అదే వ‌స్తుంద‌న్న ధీమాను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. సీఎం రేసులో లేనంటూనే టైమొచ్చిన‌ప్పుడు అదే వ‌స్తుంద‌న్న సంకేతాలు ఇవ్వడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాల్లోని హాట్ టాపిక్‌.

కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి  స్ట్రాట‌జీ (T Congress)

కాంగ్రెస్ పార్టీ(T Congress) సీనియ‌ర్ లీడ‌ర్ గా, స్టార్ క్యాంపెయిన‌ర్ గా పాద‌యాత్ర‌కు త్వ‌ర‌లో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి శ్రీకారం చుట్ట‌బోతున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌డానికి సిద్ద‌ప‌డుతున్నారు. న‌ల్గొండ జిల్లా వ్యాప్తంగా మొద‌లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయాల‌ని భావిస్తున్నారు. బ‌స్సు యాత్ర‌నా? పాద‌యాత్ర నా? అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఆయ‌న తాజా వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి యాక్టివ్ అవుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం శాస‌న‌సభాప‌క్ష నేత భ‌ట్టీ విక్ర‌మార్క్(Batti vikramark)పీపుల్స్ మార్చ్ పేరుతో పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు. ఆయ‌న 800 కిలోమీట‌ర్ల వ‌ర‌కు యాత్ర‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ వ‌ర‌కు చేరుకున్నారు. త్వ‌ర‌లోనే మూడు చోట్ల బ‌హిరంగ స‌భ‌ల‌ను పెట్టాల‌ని కూడా ప్లాన్ చేస్తున్నారు. జ‌డ్చ‌ర్ల‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం వ‌ద్ద మీటింగ్ లు పెట్టాల‌ని భావిస్తున్నారు. ఆ లోపుగా కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి(Komatireddy) కూడా న‌ల్గొండ యాత్ర‌ను ముగించి సంయుక్తంగా స‌భ‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న కూడా ఉంద‌ని తెలుస్తోంది. ఆ స‌భ‌కు ప్రియాంక (Priyanka)ముఖ్య అతిథిగా హాజ‌రు అయ్యేలా ప్లాన్ చేస్తున్నార‌ని వినికిడి.

ప్ర‌తి నెలా రెండుసార్లు ప్రియాంక తెలంగాణ 

ప్ర‌తి నెలా రెండుసార్లు ప్రియాంక తెలంగాణ(T Congress) వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, మెదక్ లేదా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి ప్రియాంక‌ను పోటీ చేయించడానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో అంద‌రూ ఐక్యంగా ప‌నిచేయాల‌ని ముందుకొస్తున్నారు. అదే విష‌యాన్ని కోమ‌టిరెడ్డి వినిపించారు. అంద‌రం ఐక్యం పోరాట‌తాం అంటూ మీడియాకు చెప్పుకొచ్చారు. ఇటీవ‌ల వ‌ర‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth Reddy)వ్య‌తిరేకంగా వాయిస్ వినిపించిన కోమ‌టిరెడ్డి స‌వ‌రించుకుంటున్నారు. ఆయ‌న త‌మ్ముడు రాజ‌గోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే, రాబోవు రోజుల్లో కోమ‌టిరెడ్డి బ్రాండ్ మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీలో సౌండ్ చేయ‌నుంది.

Also Read : T Congress : రాహుల్‌, ప్రియాంక తో `భ‌ట్టీ` గ్రాఫ్ అప్

ఇటీవ‌ల జ‌రిగిన యూత్ డిక్ల‌రేష‌న్ సంద‌ర్భంగా వెంక‌ట‌రెడ్డి(Komatireddy) క‌నిపించ‌లేదు. ఆ రోజున ప్రియాంక హాజ‌రైన స‌భ‌కు కూడా దూరంగా ఉండ‌డంతో ఇక ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి దూర‌మ‌వుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ స‌భ మీద ప్రియాంక (Priyanka) అస‌హ‌నంగా ఉన్నార‌ని తెలిసింది. ఆ స‌భ మీద పోస్ట్ మార్టం ఏఐసీసీ చేసింద‌ట‌. ఆ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌స్తావ‌న వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అందుకే, ఆయ‌న‌తో ఢిల్లీ వ‌ర్గాలు మాట్లాడిన సంద‌ర్భంగా రాజ‌గోపాల్ రెడ్డి(Rajgopal Reddy) ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింద‌ని వినికిడి. మొత్తం మీద కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ మ‌రోసారి (T Congress)కాంగ్రెస్ పార్టీలో కీల‌కంగా మార‌తార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఎంత వ‌ర‌కు ప్రియాంక గేమ్ ఫ‌లిస్తుందో చూడాలి.

Also Read : T Congress : ఆ న‌లుగురు కాంగ్రెస్లోకి వ‌స్తే..బీజేపీ క్లోజ్