T Congress : ఆ న‌లుగురు కాంగ్రెస్లోకి వ‌స్తే..బీజేపీ క్లోజ్

తెలంగాణ రాజ‌కీయాల్లో `సీన్ రివ‌ర్స్` కానుంది. (T Congress) వీడి వెళ్లిన వాళ్లు తిరిగి సొంత‌గూటికి చేరుకోవ‌డానికి అడుగులు వేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - May 18, 2023 / 02:06 PM IST

తెలంగాణ రాజ‌కీయాల్లో `సీన్ రివ‌ర్స్` కానుంది. కాంగ్రెస్ పార్టీని (T Congress) వీడి వెళ్లిన వాళ్లు తిరిగి సొంత‌గూటికి చేరుకోవ‌డానికి అడుగులు వేస్తున్నారు. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత మారిన ప‌రిస్థితులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth Reddy) అనుకూలంగా క‌నిపిస్తున్నాయి. ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంద‌న్న సంకేతాన్ని బ‌లంగా తీసుకెళ్లారు. ఫ‌లితంగా బీజేపీ దాదాపుగా వెనుక‌బడింది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన బీజేపీలోని సీనియ‌ర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లో తెలంగాణ రాష్ట్రానికి రానున్న సోనియా స‌మ‌క్షంలో చాలా మంది సొంత‌గూటికి చేర‌తార‌ని తెలుస్తోంది.

తెలంగాణ రాజ‌కీయాల్లో `సీన్ రివ‌ర్స్`(T Congress)

గాంధీ ఐడియాల‌జీ సెంట‌ర్ ను ప్రారంభించ‌డానికి(T Congress) సోనియా గాంధీ వ‌చ్చే నెల 20వ తేదీన హైద‌రాబాద్ రాబోతున్నారు. ఆ మేర‌కు గాంధీ కుటుంబం షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. ఆ రోజున రాహుల్, ప్రియాంక కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. క‌ర్ణాట‌క ఫ‌లితాల‌తో జోష్ మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వ‌చ్చే 20న సోనియా(Sonia)రాక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. మరుపురాని విధంగా ఏర్పాట్లు చేస్తోంది. పార్టీని(T Congress) వీడిన వాళ్లు తిరిగి వ‌చ్చేలా ప్లాన్ చేసుకుంటున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ జాబితాలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఉన్నార‌ని కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతోన్న అంత‌ర్గ‌త చ‌ర్చ‌.

ఈటెల రాజేంద్ర‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, బండి సంజ‌య్ కీల‌కం

ప్ర‌స్తుతం బీజేపీ చేరిక‌ల క‌మిటీలో ఈటెల రాజేంద్ర‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, బండి సంజ‌య్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ, ఆశించిన విధంగా ఇత‌ర పార్టీల నుంచి బీజేపీలోకి ఎవ‌రూ చేర‌లేదు. క‌మిటీని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లో ఒక‌రు అరా వ‌చ్చిన‌ప్ప‌టికీ వెంట‌నే బీజేపీ వాల‌కాన్ని చూసిన త‌రువాత స‌ర్దుకున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు( T Congress)  కాంగ్రెస్ పార్టీ జాతీయ లీడ‌ర్ గా ఫోక‌స్ అయిన శ్రావ‌ణ్ ను బీజేపీ ఆక‌ర్షించింది. ఆయ‌న బీజేపీలో చేరిన వారం తిర‌గ‌కుండా బీఆర్ఎస్ పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన విజ‌య‌శాంతి, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, డీకే అరుణ, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌దిత‌రులు పైకి చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ అసంతృప్తిగా ఉన్నార‌ని పార్టీలోని వాళ్లే చెప్పుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇత‌ర పార్టీ ల నుంచి బీజేపీలోకి రావాలంటే ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తున్నారు.

బీజేపీలోని అంత‌ర్గ‌త రాజ‌కీయ ప్ర‌మాద‌క‌రం ఏ స్థాయిలో ఉందో

ద‌క్షిణ తెలంగాణలో కీల‌కంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు బీజేపీలో చేర‌డానికి సందేహిస్తున్నారు. ముహూర్తం ఫిక్స్ అయింద‌ని ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ చివ‌రి నిమిషంలో ఆగిపోయారు. బీజేపీ చేరిక‌ల క‌మిటీలోని కొండా, ఈటెల చేసిన ప్ర‌య‌త్నం ఏ మాత్రం ఫ‌లించ‌లేదు. కాంగ్రెస్ నుంచి వెళ్లిన వాళ్లు చెబుతోన్న ఫీడ్ బ్యాక్ ను తీసుకున్న పొంగులేటి, జూప‌ల్లి కొత్త పార్టీ పెట్టుకోవ‌డానికి ఒకానొక సమ‌యంలో సిద్ధ‌య‌మ్యార‌ని తెలుస్తోంది. అంటే, బీజేపీలోని అంత‌ర్గ‌త రాజ‌కీయ ప్ర‌మాద‌క‌రం ఏ స్థాయిలో ఉందో అర్థ‌మ‌వుతోంది. అందుకే, ఎవ‌రూ అటు వైపు చూడ‌డంలేదు. పైగా క‌ర్ణాట‌క ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత బీజేపీ చేరిక‌ల క‌మిటీ లీడ‌ర్లు ఫోన్ల‌ను కూడా ఇత‌ర పార్టీల నేత‌లు లిఫ్ట్ చేయ‌డంలేద‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న న్యూస్.

Also Read : Youth Congress War Room: తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటి దొంగలు

వాస్త‌వంగా బీజేపీ తెలంగాణాలో(T BJP) బ‌లంగా లేదు. ఆ పార్టీ అధ్య‌క్షుడుగా బండి సంజ‌య్ ప్ర‌జాసంగ్రామ యాత్ర‌లు చేప‌ట్టిన త‌రువాత కొంత బ‌ల‌ప‌డిన‌ట్టు క‌నిపించింది. దానికి తోడుగా దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు ఇచ్చిన బూస్ట‌ప్ ను సానుకూలంగా మ‌లుచుకోవ‌డానికి కేసీఆర్ (KCR) ఛాన్స్ ఇచ్చారు. ద‌క్షిణ తెలంగాణ ప్రాంతంలో జ‌రిగిన హుజూర్ న‌గ‌ర్‌, నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అడ్ర‌స్ కూడా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ వెనుక‌బ‌డింది. అయిన‌ప్ప‌టికీ బీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం బీజేపీ అనే స్థాయిలో మైండ్ గేమ్ ఆడ‌డానికి కేసీఆర్ స‌హ‌కారం బాగా అందించార‌ని కాంగ్రెస్ తొలి నుంచి చెబుతోంది. ఇదంతా కేసీఆర్ ఎత్తుగ‌డ‌లో భాగంగా ఇప్పుడు అంద‌రికీ తెలిసిపోయింది.

Also Read : AP Congress : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు.. ఏపీలో ఉపయోగపడుతుందా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి కామెంట్స్..

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్(T Congress) తొలి నుంచి బ‌లంగా ఉంది. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, అనైక్య‌త ఆ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నాయి. కానీ, ఓటు బ్యాంకు చాలా బ‌లంగా ఉంది. అందుకే, ఆ పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి బీజేపీని వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ లేపారు. ఇప్పుడు బీజేపీ బ‌ల‌ప‌డుతుంద‌న్న ఫోక‌స్ రాగానే కేసీఆర్ యూ ట‌ర్న్ తీసుకున్నారు. కర్ణాట‌క ఫ‌లితాలు తెలంగాణ‌లో రిపీట్ కావ‌డానికి అవ‌కాశంలేద‌ని మైండ్ గేమ్ మొద‌లు పెట్టారు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన కాంగ్రెస్ ఈసారి ప్ర‌తివ్యూహాల‌ను ర‌చిస్తూ పార్టీని వీడి వెళ్లిన వాళ్లును తిరిగి ఆహ్వానిస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఈటెల‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, మ‌హేశ్వ‌ర‌రెడ్డిల‌తో సీనియ‌ర్లు కాంగ్రెస్ పార్టీలోకి రావాల‌ని కోరుకుంటోంది. అంతేకాదు, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావును కూడా ఆక‌ర్షించ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఆ ఆప‌రేష‌న్ ఫ‌లిస్తే ఎన్నిక‌ల‌కు ముందుగానే కాంగ్రెస్ విజ‌యం సాధించ‌న‌ట్టే అవుతోంది.