T Congress : వ‌న్ మేన్ షో, నిరుద్యోగ స‌భ‌ల ర‌చ్చ‌!

తెలంగాణ కాంగ్రెస్ (T Congress) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)`వ‌న్ మేన్ షో`

  • Written By:
  • Publish Date - April 20, 2023 / 01:29 PM IST

తెలంగాణ కాంగ్రెస్ (T Congress) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)`వ‌న్ మేన్ షో` ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఏక‌ప‌క్షంగా ఆయ‌న తీసుకుంటోన్న నిర్ణ‌యాలు ఆ పార్టీ గ్రాఫ్ ను నానాటికీ దిగజార్చుతోంది. ఆ విష‌యాన్ని సీనియ‌ర్లు ప‌లుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయ‌న‌కు ఒక నిబంధ‌న ఇత‌రుల‌కు మ‌రో నిబంధ‌న అనేలా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని పార్టీలోని కాంగ్రెస్ వాదులు త‌ప్పుబ‌డుతున్నారు. పార్టీని వీడిన వాళ్లు కూడా రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోక‌డ‌ను ఎత్తిచూపారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న తీరు మార‌లేదన‌డానికి న‌ల్గొండ స‌భ తాజా ఉదాహ‌ర‌ణ‌.

రేవంత్ రెడ్డి `వ‌న్ మేన్ షో`(T Congress)

రాష్ట్ర వ్యాప్తంగా యూనివ‌ర్సిటీల్లో నిరుద్యోగ దీక్ష‌లు చేప‌ట్టాల‌ని పీసీసీ చీఫ్(T Congress)  రేవంత్ రెడ్డి భావించారు. కార్య‌క్ర‌మాల క‌మిటీతో చ‌ర్చించ‌కుండా తేదీల‌ను ప్ర‌క‌టించారు. ఈనెల 21న న‌ల్గొండ‌, 24న ఆదిలాబాద్, 26న ఖ‌మ్మం, వ‌చ్చేనెల 5, 6 తేదీల్లో క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ నిరుద్యోగ స‌భ‌లు ఉంటాయ‌ని వెల్ల‌డించారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న మేర‌కు కొన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, న‌ల్గొండ జిల్లాలో మాత్రం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిర్ణ‌యానికి బ్రేక్ ప‌డింది. స్థానిక నేత‌లు, కార్య‌క్ర‌మాల క‌మిటీతో చ‌ర్చించ‌కుండా స‌భ‌ను ప్ర‌క‌టించ‌డాన్ని మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌ప్పు బ‌ట్టారు.

రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం పెద్ద‌గా లేకుండా అధిష్టానం

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యం మీద అధిష్టానంకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జి మాణిక్ రావు థాక‌రే దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ అధిష్టానం వెంట‌నే స్పందించ‌డంతో న‌ల్గొండ నిరుద్యోగ స‌భ ర‌ద్దు అయింది. మిగిలిన జిల్లాల్లోనూ ఆ స‌భ‌లు ఉంటాయ‌న్న న‌మ్మ‌కం లేదు. గ‌తంలోనూ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన త‌రువాత. ద‌ళిత, గిరిజ‌న దండోరా స‌భ‌ల‌ను పెట్టారు. అప్పుడు కూడా కార్య‌క్ర‌మాల క‌మిటీ చైర్మ‌న్ గా ఉన్న మ‌హేశ్వ‌ర‌రెడ్డికి తెలియ‌చేయ‌లేదు. దీంతో అప్ప‌ట్లో పెద్ద వివాదం రేగింది.

నిరుద్యోగ స‌భ‌ల‌ను ఏక‌ప‌క్షంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) 

పీసీసీ కార్య‌వ‌ర్గంకు(T Congress) తెలియ‌చేయ‌కుండా ఏక‌ప‌క్షంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy)తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను జ‌గ్గారెడ్డి, డిప్యూటీ రాజ‌నర‌సింహ త‌దిత‌రులు త‌ప్పుబ‌ట్టారు. ఆయ‌న వాల‌కాన్ని అప్ప‌ట్లో ఢిల్లీ వ‌ర‌కు తీసుకెళ్లారు. ఫ‌లితంగా ముఖాముఖి స‌మావేశాల‌ను అధిష్టానం నిర్వ‌హించింది. అంతా స‌ర్దుకుంటుంద‌ని అధిష్టానం భావించింది. కానీ, రేవంత్ రెడ్డి మోనోపాలియో ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఫ‌లితంగా కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జి మాణిక్ ఠాకూర్ మార్పు జ‌రిగింది.

మ‌రోసారి సీనియ‌ర్ల వ‌ర్సెస్ రేవంత్ రెడ్డి వివాదం( T Congress)

జిల్లా అధ్య‌క్షుల‌కు తెలియ‌కుండా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆయా జిల్లాల‌కు, నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళుతున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో ఎక్క‌డికైనా వెళ‌తానంటూ ఆయ‌న భావిస్తున్నారు. అదే, ఢిల్లీ పెద్ద‌లు తెలంగాణ‌కు వ‌స్తే మాత్రం ఆయ‌న‌కు చెప్పాల‌ని ఒత్తిడి తెస్తున్నారు. గ‌త ఏడాది కేంద్ర మాజీ మంత్రి శిశిథ‌రూర్ తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా పీసీసీ చీఫ్(T Congress) అనుమ‌తి లేకుండా తెలంగాణ కార్య‌క్ర‌మాల్లో ఎలా పాల్గొంటావ‌ని ట్వీట్ ద్వారా థ‌రూర్ ను నిల‌దీశారు. ఆ అంశం వివాద‌స్ప‌దం కావ‌డంతో అధిష్టానం రేవంత్ రెడ్డిని మంద‌లించింది. దీంతో ఆయ‌న థ‌రూర్ కు క్ష‌మాప‌ణ చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఒంటెద్దు పోక‌డను రేవంత్ రెడ్డి ఆప‌లేద‌ని సీనియ‌ర్లు ప‌లుమార్లు ప్ర‌స్తావించారు. ప‌లు వేదిక‌ల‌పై ఆయ‌న హ‌వాను చూపించుకుంటూ పార్టీని త‌క్కువ చేస్తున్నార‌ని కూడా అధిష్టానం వ‌ద్ద ఫిర్యాదులు ఉన్నాయి.

Also Read : T Congress: మంచిర్యాలలో`సీఎం`చిచ్చు,రాజేసిన కోమ‌టిరెడ్డి

తాజాగా నిరుద్యోగ స‌భ‌ల‌ను ఏక‌ప‌క్షంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్ర‌క‌టించారు. దీంతో మ‌రోసారి సీనియ‌ర్ల వ‌ర్సెస్ రేవంత్ రెడ్డి వివాదం రాజుకుంది. న‌ల్గొండ స‌భ వ‌ర‌కు ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించిన  స‌భ‌లు  అన్నింటినీ ర‌ద్దు చేశారా? అనేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అధిష్టానం కూడా భ‌ట్టీ విక్ర‌మార్క్ కు ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో రేవంత్ మ‌రింత దూకుడు పెంచారు. మంచిర్యాల‌లో జ‌రిగిన స‌త్యాగ్ర‌హ స‌భ‌లోనూ రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం పెద్ద‌గా లేకుండా అధిష్టానం చేసిందని పార్టీ వ‌ర్గాల్లోని టాక్. ఎన్నిక‌ల వేళ ఇలాంటి ప‌రిణామాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి(T Congress) మ‌రింత న‌ష్టం క‌లిగిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : T Congress :రేవంత్ మార్క్ ,ప్రేమ్ సాగ‌ర్ రావుకు ఎస‌రు