T Congress : రేవంత్ రెడ్డి చాణ‌క్యం! కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ పోరు డైవ‌ర్ట్!

తెలంగాణ కాంగ్రెస్(T Congress) రేవంత్ వ‌ర్సెస్ సీనియ‌ర్ల మ‌ధ్య సాగుతోన్న యుద్ధాన్ని

  • Written By:
  • Updated On - December 19, 2022 / 03:43 PM IST

తెలంగాణ కాంగ్రెస్(T Congress) సంక్షోభాన్ని వ్యూహాత్మ‌కంగా రేవంత్ రెడ్డి అనుకూలంగా మ‌లుచుకున్నారు. ఏడాదిన్న‌ర కాలంగా రేవంత్(Revanth reddy) వ‌ర్సెస్ సీనియ‌ర్ల మ‌ధ్య సాగుతోన్న ప్ర‌చ్ఛ‌న్న యుద్ధాన్ని జూనియ‌ర్లు వ‌ర్సెస్ సీనియ‌ర్ల మ‌ధ్య ర‌గ‌డగా మార్చేశారు. గ‌త రెండు రోజులుగా కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ (Cycle Congress)నినాదం బ‌య‌ట‌కు వ‌చ్చింది. నికార్సైన కాంగ్రెస్  వాదుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని సీనియ‌ర్లు బ‌య‌ట ప‌డ్డారు. సైకిల్ కాంగ్రెస్(Cycle Congress) వాళ్ల‌కు పీసీసీ కార్య‌వ‌ర్గంలో ప‌ద‌వులు పొందార‌ని ఆరోపించారు. ఆ దిశ‌గా ప‌రాకాష్ట‌కు వెళ్లిన వివాదాన్ని జూనియ‌ర్లు, సీనియ‌ర్ల మ‌ధ్య పోరుగా రేవంత్ రెడ్డి(Revanth reddy) మ‌ర‌ల్చ‌డం గ‌మ‌నార్హం.

రెండు రోజుల క్రితం నువ్వా? మేమా? తేల్చుకుందాం అంటూ సీనియ‌ర్లు మీడియాకు ఎక్కారు. పీసీసీ (T Congress)చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఆగ్ర‌హించారు. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తూ `సేవ్ కాంగ్రెస్` నినాదాన్ని వినిపించారు. పీసీసీ కార్య‌వ‌ర్గం స‌మావేశానికి సీనియ‌ర్లు దూరంగా ఉన్నారు. దీంతో ఢిల్లీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ కార్య‌ద‌ర్శి జావెద్‌, రోహిత్ చౌద‌రి మొత్తం ఎపిసోడ్ ను అధ్య‌య‌నం చేశారు. సీనియ‌ర్ల‌ను ఢిల్లీకి ఆహ్వానించారు. కానీ, వాళ్లు సుముఖంగా లేరు. ఏఐసీసీ దూత‌లు హైద‌రాబాద్ కు రావ‌డానికి సిద్ధం అయ్యారు. ఆ లోపుగా జూనియ‌ర్లు తెర‌మీద‌కు వ‌చ్చారు. ఫ‌లితంగా సీనియ‌ర్లు, జూనియ‌ర్ల మ‌ధ్య పోరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది.

సోష‌ల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి హైప్ అయ్యారు. దాన్ని చూసి పీసీసీ చీఫ్ గా ఆయ‌న్ను ఢిల్లీ అధిష్టానం నియ‌మించింది. కానీ, క్షేత్ర‌స్థాయిలో అంత సీన్ ఆయ‌న‌కు లేద‌ని సీనియ‌ర్లు బ‌లంగా చెప్పే మాట‌. ఆ విష‌యాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయిన‌ప్ప‌టికీ సీనియ‌ర్ల ప‌ట్ల పెద్ద‌గా సానుకూల‌త చూప‌లేదు. ఒక‌టి రెండుసార్లు రేవంత్‌, సీనియ‌ర్ల మ‌ధ్య పంచాయ‌తీ చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేదు. పైగా సీనియ‌ర్ల‌ను రెచ్చ‌గొట్టేలా హోంగార్డులు, ఐపీఎస్ ఫార్ములాను రేవంత్ రెడ్డి బ‌హిరంగంగా వినిపించారు. అంతేకాదు, రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి నాయ‌క‌త్వం ఉండాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ల‌డానికి కార‌ణంగా శాస‌న భాప‌క్ష నేత‌గా భ‌ట్టి విగ్ర‌మార్క్ ఉండ‌డ‌మేనంటూ ప‌రోక్షంగా ఆయ‌న కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

భ‌ట్టి ప‌ద‌విపై రేవంత్‌ (T Congress)

ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎస్సీ వ‌ర్గానికి చెందిన భ‌ట్టి విక్ర‌మార్క్ ఉండ‌కూడ‌ద‌ని కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను లాగేసుకున్నార‌ని రేవంత్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్‌. అయితే, దాని వెనుక భ‌ట్టి విక్ర‌మార్క్ శాస‌న స‌భాప‌క్ష నేత‌గా ఉన్న కార‌ణంగా ఎమ్మెల్మేలు వెళ్లిపోయార‌న్న భావ‌న ఉంద‌ని కాంగ్రెస్ లోని ఒక వ‌ర్గం న‌మ్ముతుంది. రాబోవు రోజుల్లో రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి శాస‌న‌స‌భాప‌క్షం ఉండేలా ఇప్ప‌టి నుంచే రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడ‌ని ఆయ‌న వ్య‌తిరేకుల భావ‌న‌. ఆయ‌న భావ‌జాలానికి అనుగుణంగా పీసీసీ కార్య‌వ‌ర్గం కూడా ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. తెలుగుదేశం నుంచి వ‌చ్చిన వాళ్లు పీసీసీ కార్య‌వ‌ర్గంలో ఎక్కువ‌గా లేర‌ని మాజీ ఎంపీ మ‌ల్లు ర‌వి తొలుత ఒక జాబితా విడుద‌ల చేశారు. ఆ త‌రువాత వ్యూహాత్మ‌కంగా 13 మంది రేవంత్ రెడ్డి వ‌ర్గీయులు రాజీమాలు చేశారు. దీంతో సీనియ‌ర్లు, జూనియ‌ర్ల ఇష్యూగా కాంగ్రెస్ వివాదాన్ని తీసుకెళ్ల‌గ‌లిగారు.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత స‌భ్య‌త్వ న‌మోదు రికార్డ్ స్థాయిలో జ‌రిగింది. అదే విష‌యాన్ని ప్ర‌స్తుత సంక్షోభంలో ఆయ‌న హైలెట్ చేస్తున్నారు. కానీ, హుజూరాబాద్‌, మ‌నుగోడు ఓట‌ముల‌ను(డిపాజిట్లు రాక‌పోవ‌డాన్ని) తెర‌మీద‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. తొలి రోజుల్లో దళిత , గిరిజ‌న దండోరా అంటూ హ‌డావుడి చేశారు. పీసీసీ చీఫ్ గా అంద‌రి దృష్టికి వెళ్లారు. ఆ త‌రువాత ప్ర‌భుత్వం మీద పోరాటాల‌ను కూడా త‌గ్గించారు. కాళేశ్వ‌రం, డ్ర‌గ్స్, లిక్క‌ర్ స్కామ్ త‌దిత‌రాల‌పై పెద్ద‌గా ఆయ‌న క్షేత్ర‌స్థాయి పోరాటాల‌కు పిలుపు నివ్వ‌లేదు. కేవలం మీడియా స‌మావేశాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. ప్రాంతీయ పార్టీల్లో మాదిరిగా ఒన్ మేన్ షో చేయాల‌ని చూస్తున్నార‌ని కాంగ్రెస్ వాదుల భావ‌న‌. స‌రిగ్గా ఈ పాయింట్ వ‌ద్దే వివాదం నెల‌కొంది.

ఏడాదిన్న‌ర‌గా ఉన్న రేవంత్ వ‌ర్సెస్ సీనియ‌ర్ల వివాదం ఇటీవ‌ల సునీల్ క‌నుగోలు ఆఫీస్ మీద తెలంగాణ పోలీసులు రైడ్ చేసిన త‌రువాత ప‌రిణామాలు మ‌రింత ముదిరాయి. సీనియ‌ర్ల‌కు వ్య‌తిరేకంగా సునీల్ ఆఫీస్ నుంచి పోస్టులు పెడుతున్నార‌ని బ‌య‌ట ప‌డింది. ఆ విష‌యాన్ని సీపీ ఆనంద్ చెప్పిన‌ట్టు మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. అంటే, ఇప్ప‌టి వ‌ర‌కు సీనియ‌ర్ల‌ను డ్యామేజ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన వీడియోల‌న్నీ సునీల్ ఆఫీస్ నుంచి వ‌చ్చిన‌వేన‌ని విశ్వ‌సిస్తున్నారు. పార్టీ నుంచి సీనియ‌ర్ల‌ను పంప‌డం ద్వారా బ‌ల‌హీన‌ప‌ర‌చాల‌ని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశార‌ని సీనియ‌ర్ల ఆరోప‌ణ‌. ఆయ‌న బీజేపీకి కోవ‌ర్టిజం చేస్తున్నార‌ని ప‌రోక్షంగా మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర‌సింహా ఆరోప‌ణ‌ల‌కు దిగారు. వాటికి బ‌లం చేకూరేలా సునీల్ కొనుగోలు ఆఫీస్ పోస్టులు ఉండ‌డం సీనియ‌ర్ల క‌డుపు ర‌గిలేలా చేశాయి. సోష‌ల్ మీడియాలో సీనియ‌ర్ల‌పై వ్య‌తిరేకంగా పెడుతోన్న పోస్టుల వ్య‌వ‌హారాన్ని ఆధారాల‌తో స‌హా ఏఐసీపీకి సీనియ‌ర్లు ఫిర్యాదు చేశారు. ఫ‌లితంగా కాంగ్రెస్ మ‌ధ్య అంత‌ర్గ‌త పోరు తారాస్థాయికి చేరింది.

ప్రియాంక రావ‌డ‌మే ప‌రిష్కారం

ఇప్పుడున్న ప‌రిస్థితులు ప్రియాంక గాంధీ నేరుగా జోక్యం చేసుకుంటేనే ప‌రిష్కారం ల‌భించేలా ఉంది. ఎందుకంటే, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి ఠాకూర్, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త సునీల్‌, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మ‌డిగా ఆడుతోన్న గేమ్ గా సీనియ‌ర్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని వాళ్ల అభిప్రాయం. అంతేకాదు, రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌కు రూట్ క్లియ‌ర్ చేసేలా సునీల్ స‌ర్వేల‌ను త‌యారు చేశార‌ని అనుమానాలు లేక‌పోలేదు. ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వాళ్లు పాద‌యాత్ర‌లు చేయ‌డానికి ఏఐసీసీ ప్లాన్ చేస్తోంది. సీనియ‌ర్లు అంద‌ర్నీ క‌లుపుకుని బ‌స్సు యాత్ర చేయాల‌ని మ‌రో ప్లాన్ ఉంద‌ట‌. ఆ లోపుగా రేవంత్ రెడ్డి పాద‌యాత్ర అంటూ తెర‌మీద‌కు రావ‌డం సునీల్ రేవంత్‌, ఠాకూరు ఆడిని గూడుపుఠానీగా సీనియ‌ర్లు విశ్వసిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో గాంధీ కుటుంబం నేరుగా జోక్యం చేసుకుంటేనే ఎంతోకొంత ప‌రిష్కారం ఉంటుంద‌ని కాంగ్రెస్ వాదులు భావిస్తున్నారు. అదే జ‌రిగితే రేవంత్ జ‌న‌వ‌రి 26 నుంచి చేప‌ట్టాల‌నుకుంటోన్న పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డిన‌ట్టే!

Revanth Reddy: పాదయాత్రకు సిద్ధమౌతున్న రేవంత్ రెడ్డి..?