T BJP : బీజేపీలోగ్రూప్ లు, రెండోసారి చీఫ్`బండి`సందేహ‌మే.!

రెండోసారి తెలంగాణ బీజేపీ(T BJP) అధ్య‌క్షుడిగా బండిను ప్ర‌క‌టించ‌డానికి

  • Written By:
  • Publish Date - March 23, 2023 / 03:25 PM IST

రెండోసారి తెలంగాణ బీజేపీ(T BJP) అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ ను ప్ర‌క‌టించ‌డానికి ఢిల్లీ అధిష్టానం లెక్క‌లు వేస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఆయ‌న్ను(Bandi Sanjay కంటిన్యూ చేయాలంటే ఆలోచిస్తోంది. గ్రూప్ విభేదాల‌తో లోలోప‌ల ర‌గిలిపోతున్న బీజేపీని ఏక‌తాటిపైకి ఎలా తీసుకురావాలో ఇంచార్జి త‌రుణ్ చుక్ కూడా అంతుబ‌ట్టడంలేదు. మూడు గ్రూపులో ఆరు అసంతృప్తుల మాదిరిగా తెలంగాణ బీజేపీ ఉంది. దానికి కార‌ణం బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ వాల‌క‌మంటూ సీనియ‌ర్లు, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నాయ‌కులు ఒక ర‌హ‌స్య నివేదిక‌ను ఢిల్లీ పంపార‌ని తెలుస్తోంది.

రెండోసారి తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ (T BJP)

నాలుగు రాష్ట్రాల‌కు గురువారంనాడు అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించిన అధిష్టానం తెలంగాణ బీజేపీ (T BJP)చీఫ్ పేరును మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. రాబోవు ఎన్నిక‌లు బండి సంజ‌య్ (Bandi Sanjay)ఆధ్వ‌ర్యంలోనే జ‌రుగుతాయ‌ని ఇటీవ‌ల ఇంచార్జి త‌రుణ్ చుక్ ప్ర‌క‌టించారు. అయితే, అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న అధిష్టానం నుంచి రాలేదు.ఢిల్లీ, బీహార్ , రాజస్థాన్ , ఒరిస్సా రాష్ట్రాల‌కు కొత్త చీఫ్‌లను బీజేపీ నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఢిల్లీ బీజేపీ అధ్య‌క్షునిగా వీరేంద్ర సచ్‌దేవా , లోక్‌సభ ఎంపీ సీపీ జోషి ని రాజస్థాన్ బీజేపీ చీఫ్‌గా నియ‌మించారు. బీహార్ బీజేపీ చీఫ్ గా సామ్రాట్ చౌదరిని ప్ర‌క‌టించారు. ఒడిశా రాష్ట్ర‌ అధ్యక్షుడిగా మాజీ రాష్ట్ర మంత్రి మన్మోహన్ సమాల్ ను నియమిస్తూ ఢిల్లీ బీజేపీ నిర్ణ‌యం తీసుకుంది. కానీ, తెలంగాణ బీజేపీ చీఫ్ వ్య‌వ‌హారాన్ని మాత్రం తేల్చ‌లేదు.

Also Read : BJP bye to Janasena?: జై చంద్రబాబు, పవన్ ఆప్షన్ అదే.! జనసేనకు బీజేపీ బై?

రాబోవు ఎన్నిక‌ల్లో రాజ్యాధికారం కోసం తెలంగాణ వ్యాప్తంగా(T BJP) ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే, ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా ఎక్క‌డా బీజేపీ ఆచూకి లేదు. లీడ‌ర్లుగానీ, క్యాడ‌ర్ గానీ క‌నిపించ‌దు. కేవ‌లం ఉత్త‌ర తెలంగాణ వ‌రకు మాత్రమే ఆ పార్టీ క‌ళ‌క‌ళ లాడుతుంటుంది. అందుకే, ఇత‌ర పార్టీల నుంచి లీడ‌ర్ల‌ను తీసుకోవాల‌ని ఢిల్లీ బీజేపీ ఒక ప్ర‌త్యేక‌మైన క‌మిటీని వేసింది. ఆ క‌మిటీలో కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, ఈటెల రాజేంద్ర త‌దిత‌రులు ఉన్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన లీడ‌ర్ల సంఖ్య పెద్ద‌గా లేదు. పైగా బీజేపీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు ఉండ‌డం విశేషం. దానికి కార‌ణాలు లేక‌పోలేదు.

క‌రీంన‌గ‌ర్ కేంద్రంగా బండి సంజ‌య్ మీద ఒక గ్రూప్ వ్య‌తిరేకం

కాంగ్రెస్ పార్టీ నుంచి డీకే అరుణ‌, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి త‌దిత‌రులు బీజేపీలో చేరారు. వాళ్లకు త‌గిన ప్రాధాన్యం లేద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. సీనియ‌ర్ పొలిటీషియ‌న్ల‌ను క‌లుపుకుని పోయే మ‌న‌స్త‌త్వం బండి సంజ‌య్(Bandi Sanjay) కు లేద‌ని పార్టీలోని బ‌ల‌మైన వాద‌న‌. ఆయ‌న వాల‌కం న‌చ్చ‌క‌పోవ‌డంతో చాలా మంది దూరంగా ఉంటున్నారు. ఇత‌ర పార్టీల లీడ‌ర్లు ఎవ‌రూ బీజేపీ వైపు చూడ‌డంలేదు. ఇటీవ‌ల జ‌రిగిన మునుగోడు ఉప ఎన్నిక‌ల అప‌జ‌యం త‌రువాత ద‌క్షిణ తెలంగాణ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడ‌ర్లు బీజేపీ వైపు చూడ‌డంలేదు. సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్ కేంద్రంగా బండి సంజ‌య్ మీద ఒక గ్రూప్ వ్య‌తిరేకంగా ప‌నిచేస్తోంది. ఆయ‌న మీద ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు కూడా ఆ గ్రూప్ చేసింది.

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ కూడా సైలెంట్

ఇటీవ‌ల సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో జ‌రిగిన జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల ముగింపు స‌భ విజ‌య‌వంతం కావ‌డం బండి సంజ‌య్ కు (Bandi Sanjay)అధిష్టానం వ‌ద్ద మంచి మార్కుల‌ను ఇచ్చింది. ఆ వేదిక మీద న‌రేంద్ర మోడీ భుజం త‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న గ్రాఫ్ ఢిల్లీ బీజేపీ వ‌ద్ద పెరుగుతోంది. కానీ, తెలంగాణ బీజేపీలో మాత్రం త‌గ్గిపోతుంద‌ని ఆ పార్టీ వ‌ర్గీయులు చెప్పుకుంటారు. ఆ పార్టీలో ఈటెల‌, బండి, కిష‌న్ రెడ్డి, డీకే అరుణ ఇలా వేర్వేరుగా గ్రూపుల‌ను నడుపుతున్నార‌ని వినికిడి. ఒకానొక స‌మ‌యంలో ఈటెల తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వెళ‌తార‌ని కూడా విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇటీవ‌ల ఓడిపోయిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ తెలంగాణాలో బీజేపీ రావ‌డం అనేది ఎండ‌మావే. అందుకే, రెండోసారి చీఫ్ గా బండిని (Bandi Sanjay) ప్రక‌టించ‌డాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఢిల్లీ బీజేపీ వాయిదా వేస్తుంద‌ని తెలుస్తోంది.

Also Read : BJP : టాలీవుడ్ `క‌మ‌ల`గుబాళింపు,మోడీ-షా`మెగా`ఎత్తుగ‌డ‌