T BJP : అమిత్ షా ప‌ర్య‌ట‌న‌కు RRR ట‌చ్‌, BRS గ్లామ‌ర్ కు చెక్

సినిమా గ్లామ‌ర్ ను బీజేపీ(T BJP) బాగా అద్దుతోంది. గ‌తంలో రాష్ట్రానికి వ‌చ్చిన అమిత్ షా

  • Written By:
  • Updated On - April 21, 2023 / 04:32 PM IST

తెలంగాణలో రాజ్యాధికారం కోసం సినిమా గ్లామ‌ర్ ను బీజేపీ(T BJP) బాగా అద్దుతోంది. గ‌తంలో రాష్ట్రానికి వ‌చ్చిన అమిత్ షా టాలీవుడ్ అగ్ర హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ ను(RRR) ఆయ‌న ఉన్న హోటల్ కు పిలిపించుకున్నారు. ఈనెల 23వ తేదీన హైద‌రాబాద్ కు వ‌స్తోన్న షా ఈసారి ఆర్ఆర్ ఆర్ మూవీలోని హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క‌ల‌వ‌బోతున్నారు. అందుకు సంబంధించిన అపాయిట్మెంట్ ఫిక్స్ అయింది.

తెలంగాణలో రాజ్యాధికారం కోసం బీజేపీ సినిమా గ్లామ‌ర్ (T BJP)

ఆస్కార్ లెవ‌ల్ కు వెళ్లిన త్రిబుల్ ఆర్(RRR) సినిమాలోని పాట గురించి అంద‌రికీ తెలుసు. అందుకు సంబంధించిన ప్ర‌శంస‌లు, అభినంద‌న స‌భ‌ల హ‌డావుడి కూడా ముగిసింది. ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా రామ్ చ‌ర‌ణ్ అండ్ టీమ్ తో భేటీ అయ్యారు. ఇప్పుడు అమిత్ షా అగ్ర హీరోల‌తో భేటీ కానున్నారు. తెలంగాణ‌కు వ‌స్తోన్న షా టూర్లో ఇదో హైలెట్ గా నిల‌వ‌నుంది. ఇలాంటి భేటీలు రాజ‌కీయ (T BJP)చ‌తుర‌త‌లో ఒక భాగం. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ఎన్నిక‌లు జ‌రుగుతోన్న క్ర‌మంలో అగ్ర హీరోలను ప్ర‌చారానికి రిక్వెస్ట్ చేస్తారా? అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అమిత్ షా అగ్ర హీరోల‌తో భేటీ

ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న వేళ బీజేపీ (T BJP) గ్రాఫ్ పెద్ద‌గా తెలంగాణ వ్యాప్తంగా పెర‌గ‌డంలేదు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఇటీవ‌ల బండి సంజ‌య్ ను రెండుసార్లు హస్తిన‌కు పిలిపించుకున్నారు. ఆయ‌న‌తో మంత‌నాలు సాగించారు. కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల ఇంచార్జిగా ఉన్న ఏలేటి మ‌హేశ్వ‌ర‌రెడ్డి ఇటీవ‌ల బీజేపీలో చేర‌డానికి ప్ర‌ధానంగా ఈటెల రాజేంద్ర లైజ‌నింగ్ చేశారు. ఇత‌ర పార్టీల నుంచి పాపుల‌ర్ లీడ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి వేసిన చేరిక క‌మిటీ మీద ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు అసంతృప్తిగా ఉన్నారు. ఆ క‌మిటీలోని ఈటెల‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, బండి సంజ‌య్ త‌దిత‌రుల ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించ‌డంలేదు. దీంతో నేరుగా ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు రంగంలోకి దిగుతున్నార‌ని తెలుస్తోంది.

రాబోవు 160 రోజుల‌ టార్గెట్

ఈనెల 23న తెలంగాణ‌కు (T BJP) రానున్న అమిత్ షా భారీ బ‌హిరంగ స‌భ జ‌ర‌గ‌నుంది. దాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి ప‌లు ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకోసం గురువారం అత్య‌వ‌స‌రంగా కోర్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా రాబోవు 160 రోజుల‌ను టార్గెట్ గా పెట్టుకుని ప‌నిచేయాల‌ని క‌మిటీ తీర్మానం చేసింది. దాని ప్ర‌కారం బూత్ స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయాలి. ప‌నిచేయ‌ని వాళ్ల‌ను ఏరిపారేయాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకుంది. త్వ‌ర‌లోనే జిల్లా, నియోజ‌క‌వ‌ర్గం, మండ‌ల స్థాయి క‌మిటీ. అధ్య‌క్షుల‌ను కూడా మార్చ‌డానికి సిద్దం కావాల‌ని కోర్ క‌మిటీ ఆదేశించింది. ఇలాంటి నిర్ణ‌యాలు అన్నీ బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల నుంచి వ‌చ్చిన‌విగా చెబుతున్నారు. ఇక సినిమా గ్లామ‌ర్ ను  కూడా బాగా ఆక‌ర్షించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో అమిత్ షా టాలీవుడ్ అగ్ర హీరోల‌తో (RRR) మంత‌నాలు సాగించ‌నున్నారు.

Also Read : YCP- BJP : బంధానికి గండి! జ‌గ‌న్ స‌ర్కార్ కు మూడిన‌ట్టే?

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత కేసీఆర్ వెంట సినిమా ప‌రిశ్ర‌మ ఉంది. ఆ విధంగా కేసీఆర్ వ్యూహాల‌ను రచించారు. సినిమా పెద్ద‌లు ఎవ‌రూ క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని కాద‌ని అడుగు వేసే ప‌రిస్థితి లేదు. పైగా అగ్ర హీరోల‌తో మంత్రి కేటీఆర్ త‌ర‌చూ ట‌చ్ లో ఉంటారు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కూడా ఎప్పుడూ సినిమా వాళ్ల‌తో స్నేహం ఉంటుంది. ఇవ‌న్నీ బీఆర్ఎస్ పార్టీకి క‌లిసొచ్చే అంశాలు. అందుకే, బీజేపీ (T BJP) కూడా సినిమా గ్లామ‌ర్ మీద క‌న్నేసింది. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీని వెట‌ర‌న్ హీరో మోహ‌న్ బాబు కుటుంబం క‌లిసింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ ను త‌ర‌చూ బీజేపీ నేత‌లు తమ‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకోసం అమిత్ షా , మోడీ, న‌డ్డా త‌దిత‌ర జాతీయ నేత‌లు కూడా పాలుపంచుకోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Telangana BJP :`బండి`ప‌ద‌వికి మూడింది.?ఆప‌రేష‌న్ `షా`