T BJP in Trouble : తెలంగాణ BJP ఢ‌మాల్! తోక‌ముడిచిన‌ట్టేనా?

తెలంగాణ బీజేపీకి (T BJP in Trouble)ఏమైయింది? ఆ పార్టీ పెట్టుకున్న రాజ్యాధికార ఆశ గ‌ల్లంతేనా? స్వ‌యం కృతాప‌రాధం ఆ పార్టీని వెంటాడుతుందా?

  • Written By:
  • Updated On - July 24, 2023 / 03:26 PM IST

తెలంగాణ బీజేపీకి (T BJP in Trouble)ఏమైయింది? ఆ పార్టీ పెట్టుకున్న రాజ్యాధికార ఆశ గ‌ల్లంతేనా? స్వ‌యం కృతాప‌రాధం ఆ పార్టీని వెంటాడుతుందా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎన్నో క‌మ‌లనాథుల నుంచి వినిపిస్తోంది. మూడేళ్లుగా బండి సంజ‌య్ క‌ష్ట‌ప‌డి పెంచిన పార్టీని జాతీయ ఈక్వేష‌న్ల క్ర‌మంలో కుప్ప‌కూల్చార‌ని క్యాడ‌ర్ ఆవేద‌న చెందుతోంది. ఫాంహౌస్ కేసు ప్ర‌భావ‌మా? గ్రూపుల బెడ‌దా? కేసీఆర్ చాణ‌క్య‌మా? బీఎల్ సంతోష్ శివ్ ప్ర‌కాష్ ను కాపాడుకోవ‌డ‌మా? కార‌ణం ఏదైతేనేం, బీజేపీ దాదాపుగా తెలంగాణ‌లో క్లోజ్ అన్న‌ట్టు క‌నిపిస్తోంది.

బీజేపీ దాదాపుగా తెలంగాణ‌లో క్లోజ్ అన్న‌ట్టు.(T BJP in Trouble)

తెలంగాణ‌కు వ‌చ్చిన మోడీ , అమిత్ షా, టీబీజేపీ ఇంచార్జి త‌రుణ్ చుక్ ఇటీవ‌ల చెప్పిన మాట‌కు భిన్నంగా బీజేపీ ప్ర‌క్షాళ‌న (T BJP in Trouble) జ‌రిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలోనే వెళ‌తామ‌ని మీడియాకు చెప్పారు. అంతేకాదు, ఢీ అంటే ఢీ అంటూ బీఆర్ఎస్, బీజేపీ క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయ క్రీడ‌ను చూపించాయి. కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తామంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. క‌నీసం 40 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని బీజేపీ పెద్ద‌లు సైతం చెప్పారు. ఎన్నిక‌ల వ‌ర‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ లోనే మకాం పెడ‌తార‌ని ప్ర‌చారం చేశారు. అందుకోసం శంషాబాద్ స‌మీపంలో గెస్ట్ హౌస్ కూడా బుక్ చేశార‌ని బీజేపీ క్యాడ‌ర్ సంబ‌ర‌ప‌డింది.

తెలంగాణ వ‌దిలిపెట్టి బీజేపీ వెళ్లేలా ఎమ్మెల్యేల ఎర కేసు

మునుగోడు ఉప ఎన్నిక‌ల సంద‌ర్బంగా బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం  (T BJP in Trouble)బ‌య‌ట‌ప‌డింది. ముగ్గురు స్వామీజీల‌ను కేసీఆర్ స‌ర్కార్ జైలుకు పంపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ అరెస్ట్ కు రంగం సిద్దం చేసింది. తెలంగాణ సిట్ అధికారులు అందుకోసం ఢిల్లీ కూడా వెళ్లారు. ఆ స‌మ‌యంలోనే మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత పేరు బ‌య‌ట‌ప‌డింది. కొన్ని వీడియోల‌ను డిల్లీ బీజేపీ లీడ‌ర్లు విడుద‌ల చేస్తూ క‌విత స్కామ్ లో ఉంద‌ని గంద‌ర‌గోళం చేశారు. ఆ త‌రువాత సీబీఐ, ఈడీ రంగంలోకి దిగింది. ఇంకేముంది, క‌విత మ‌రో క‌నిమొళి మాదిరిగా అరెస్ట్ ఖాయ‌మంటూ అంద‌రూ న‌మ్మారు. కానీ, క‌డిగిన ముత్యంలా క‌వితను బీజేపీ బ‌య‌ట‌కు పంపింద‌ని స‌గ‌టు తెలంగాణ పౌరుడు అనుమానిస్తున్నాడు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు ఎమ్మెల్యేల ఎర కేసుతో స‌రిపెట్టార‌ని

ఓటుకునోటు కేసులో చంద్ర‌బాబును ఏపీ పంపించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ వ‌దిలిపెట్టి బీజేపీ వెళ్లేలా ఎమ్మెల్యేల ఎర కేసును ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల మీద ప్ర‌యోగించార‌ని వినికిడి. కేసు కు కేసు అన్న‌ట్టు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు ఎమ్మెల్యేల ఎర కేసుతో స‌రిపెట్టార‌ని స‌ర్వ‌త్రా జ‌రుగుతోన్న ప్ర‌చారం. అందుకే, బీజేపీ, బీఆర్ఎస్ ఏక‌మైయిన‌ట్టు కనిపిస్తోంది. ఆ విష‌యాన్ని ప‌రోక్షంగా బీజేపీ లీడ‌ర్ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సూచాయ‌గా బ‌య‌ట‌పెట్టారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఏమి చేశారో తెలియ‌దుగానీ క‌విత‌క‌కు లిక్క‌ర్ స్కామ్ నుంచి త‌ప్పించుకున్నార‌ని ప‌రోక్షంగా బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల డీల్ ను బ‌య‌ట‌పెట్టారు. దానికి తోడుగా బండి సంజ‌య్ ను.(T BJP in Trouble) తెలంగాణ బీజేపీ అధ్య‌క్షునిగా మార్చేశారు.

కేసీఆర్ కోవ‌ర్టులుగా బీజేపీలో ఉన్న వాళ్లు ఆడిన గేమ్ గా (T BJP in Trouble )

వాస్త‌వంగా బీజేపీ చీఫ్ గా బండి సంజ‌య్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత విడ‌త‌ల‌వారీగా ప్ర‌జా సంగ్రామ యాత్ర‌ను చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక‌లు, గ్రేట‌ర్ హైద‌రాబాద్, హూజూరాబాద్ ఎన్నిక‌ల్లోబీజేపీ గెలిచింది. మ‌నుగోడులోనూ గ‌ట్టిపోటీనిస్తూ నైతికంగా గెలుపొందిన సంకేతాన్ని ఇవ్వ‌గ‌లిగింది. ఇటీవ‌ల జ‌రిగిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల ముగింపు స‌భ గ్రాండ్ స‌క్సెస్ అయింది. శ‌భాష్ బండి అంటూ మోడీ భుజం తట్టారు. అదే స‌మ‌యంలో బండి సంజ‌య్ మీద క‌రీంన‌గ‌ర్ కేంద్రంగా వ్య‌తిరేక గ్రూపు ర‌హ‌స్య స‌మావేశాల‌ను హైద‌రాబాద్ లో నిర్వ‌హించింది., ఇత‌ర పార్టీల నుంచి బీజేపీలో చేరిన సీనియ‌ర్లు ఒక గ్రూప్ గా బండి నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకించ‌డం  (T BJP in Trouble) మొద‌లు పెట్టారు. ఇదంతా కేసీఆర్ కోవ‌ర్టులుగా బీజేపీలో ఉన్న వాళ్లు ఆడిన గేమ్ గా కొంద‌రు భావిస్తున్నారు.

Also Read : T BJP : గ్రూప్ ల‌పై సోషల్ మీడియా హోరు! త‌రుణ్ చుక్ ఫుల్ స్టాప్‌!!

ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఈటెల రాజేంద్ర‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, కోమ‌ట‌రెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న ప‌రిస్థితి. తెలంగాణ సీఎం కేసీఆర్ ను వ్య‌తిరేకిస్తూ బీజేపీలో చేరిన వాళ్లు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు మాదిరిగా స‌మ‌కాలీన రాజ‌కీయాల‌ను అధ్య‌య‌నం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మ‌కైన‌ట్టు ఆధారాలు మ‌రిన్ని బ‌య‌ట‌ప‌డితే కోమ‌టిరెడ్డి, కొండా, ఈటెల కూడా క‌మ‌లాన్ని వ‌దిలేసే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇప్ప‌టికే బీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య మ్యాచ్ ఫిక్సింగ్ (T BJP in Trouble) ఉంద‌ని కాంగ్రెస్ చెబుతోంది. దానికి త‌గిన ఆధారాల‌ను కూడా ప‌లు సంద‌ర్బాల్లో బ‌య‌ట పెట్టింది.

Also Read : T BJP : తెలంగాణకు ఢిల్లీ పెద్ద‌ల `ముంద‌స్తు`సంకేతం ! స్ట్రీట్ ఫైట్ కు దిశానిర్దేశం!!

ప్ర‌స్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్ గా నియామ‌క‌మైన కిష‌న్ రెడ్డి, ఇంచార్జి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు స‌న్నిహితులు. పూర్వం నుంచి మంచి సంబంధాలు వాళ్ల మ‌ధ్య ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా తెలుసు. ఇలాంటి వాళ్ల‌తో కలిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫైట్ చేయ‌డానికి క్యాడ‌ర్ కూడా అనుమానిస్తోంది. పార్టీని వీలున్నంత బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి మాత్ర‌మే ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు తాజాగా చేసిన మార్పులు ఉన్నాయ‌ని బ‌లంగా శ్రేణులో ఉన్న అభిప్రాయం. ఫాంహౌస్ లో ఎమ్మెల్మేల ఎర కేసు ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌కు చిక్కుగా ఉంది. దాన్ని క్లోజ్ చేసుకునే క్ర‌మంలో పార్టీని ఉద్దేశ‌పూర్వ‌కంగా బ‌లిచేశార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.