BJP Blue Print: ఢిల్లీలో టీ బీజేపీ డ్రిల్, కవిత అరెస్ట్ పై బ్లూ ప్రింట్!

తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ఢిల్లీ పెద్దలు బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు.

  • Written By:
  • Updated On - February 28, 2023 / 11:48 AM IST

తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ (BJP) ఢిల్లీ పెద్దలు బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. దాన్ని అమలు చేయడానికి తెలంగాణ బీజేపీ లీడర్లకు దిశానిర్దేశం చేయబోతోంది. అందుకు మంగళవారం అత్యవసర సమావేశం అమిత్ షా పెట్టారు. ఆయన పిలుపు మేరకు హుటాహుటిన తెలంగాణ లీడర్లు ఢిల్లీ విమానం ఎక్కారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలను రూపొందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ రాజధానిలోని తన నివాసంలో రాష్ట్ర నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ మేరకు బీజేపీ అగ్రశ్రేణి వర్గాలు తెలిపాయి.రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ , ఇతర తెలంగాణ బిజెపి నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ సన్నద్ధమైంది.ప్రజలను అనుసంధానం చేసేందుకు, ప్రజా గోషా బీజేపీ (BJP) భరోసా, ప్రజాసంగ్రామ యాత్ర వంటి తదితర ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకు చేరువ అవుతుంది. పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ప్రచారాలకు ప్రజల నుండి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వస్తోందని, బూత్ స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై పార్టీ చర్చిస్తుంది.

బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీజేపీ 11000 బహిరంగ సభ ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. బిజెపి అధ్యక్షుడు సంజయ్ బండి పదవీకాలం మార్చి మొదటి వారంలో ముగియనున్నందున త్వరలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అయితే పార్టీ అధ్యక్షుడిగా అతని పదవీకాలం పొడిగించబడుతుందని పార్టీ ఢీల్లీ వర్గాల సమాచారం. అంతకుముందు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో సంజయ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసంగ్రామ యాత్రను ప్రశంసిస్తూ, అన్ని రాష్ట్రాలు అతని నుంచి నేర్చుకోవాలని చెప్పారు.ఆయన పోరాటాన్ని, కృషిని ప్రశంసించారు. ఈ సమావేశంలో రాబోవు రోజుల్లో బీజేపీ జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? అనే దానిపై షా క్లియర్ మెసేజ్ ఇవ్వనున్నారు.

ఆప్ మంత్రి సిసోడియా ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన సీబీఐ కస్టడీకి ఇచ్చారు. విచారణ వేగంగా జరుగుతుంది. దీంతో ఇప్పటికే ప్రతి చార్జీ షీట్లో ఉన్న కవిత ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ అరెస్ట్ ను అనుకూలంగా మలుచుకోవడానికి బి ఆర్ ఎస్ రోడ్ మాప్ తయారు చేసుకుంది. దానికి ధీటుగా బ్లూ ప్రింట్ ఇవ్వడానికి ఢిల్లీ బీజేపీ మీటింగ్ ఎజెండాగా ఉందని తెలుస్తోంది. మొత్తం మీద ఢిల్లీ బీజేపీ మీటింగ్ తరువాత తెలంగాణా రాజకీయాలు మరోలా ఉంటాయని బీజేపీ తెలంగాణ పెద్దలు చెబుతున్నారు.

Also Read:  Health ATM: యూపీలో 4,600 Health ATMల ఏర్పాటుకు ప్లాన్.. ఏమిటీ? ఎలా?