T BJP : తెలంగాణకు ఢిల్లీ పెద్ద‌ల `ముంద‌స్తు`సంకేతం ! స్ట్రీట్ ఫైట్ కు దిశానిర్దేశం!!

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు

  • Written By:
  • Updated On - February 28, 2023 / 03:27 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. ఆ మేర‌కు హ‌స్తిన వెళ్లిన రాష్ట్ర లీడ‌ర్ల‌కు (T BJP)సంకేతాలు ఇవ్వ‌డంతో పాటు దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నేత‌ల‌తో స‌మావేశానికి ముందుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా 40నిమిషాల పాటు భేటీ అయ్యారు. తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌పై వ్యూహాల‌ను ర‌చించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కోర్ గ్రూప్ సమీక్షా స‌మావేశం(Core meeting) జ‌రిగింది.

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అవ‌కాశం (T BJP)

ఎన్నికల వ్యూహాలను రూపొందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ అగ్రనేతలతో(T BJP) సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ సిఫారసు చేస్తారని స‌మావేశంలో కీల‌క అంశంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేసీఆర్ కుమార్తె క‌విత అరెస్ట్ కు సంబంధించిన అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. కొంద‌రు బీజేపీ నేత‌ల‌తో క‌విత‌కు ఉన్న సంబంధాల‌పై ఆరా తీసిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. ఆ సంబంధాల‌ను రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ ఎలా హైలెట్ చేయ‌నుంద‌నే అంశంపై సుదీర్ఘ చ‌ర్చ(Core meeting) జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌విత సంబంధించిన చార్టెర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆప్ మంత్రి సిసోడియాను అరెస్ట్ చేసిన త‌రువాత ఏమి జ‌రుగుతుంది? అనేది దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

త్వ‌ర‌లోనే క‌విత అరెస్ట్ ఖాయ‌మని..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌కు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ తో సంబంధం ఉంద‌ని సీబీఐ కొన్ని ఆధారాల‌ను సేక‌రించింది. ఇప్ప‌టికే ప‌లు అఫిడ‌విట్లు, కౌంట‌ర్ ఫైళ్ల సంద‌ర్భంగా క‌విత పేరును ప‌లుమార్లు సీబీఐ ప్ర‌స్తావించింది. ఆ క్ర‌మంలో త్వ‌ర‌లోనే క‌విత అరెస్ట్ ఖాయ‌మని దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఆ మేర‌కు జాతీయ మీడియాలోనూ వార్త‌లు రావ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాజ‌కీయంగా బీజేపీ న‌ష్ట‌పోకుండా తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి వ్యూహాల‌ను ర‌చించాలి? అనే అంశంపై కోర్ టీమ్ కు(T BJP) ఢిల్లీ బీజేపీ అగ్ర‌నేత‌లు దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : BJP Blue Print: ఢిల్లీలో టీ బీజేపీ డ్రిల్, కవిత అరెస్ట్ పై బ్లూ ప్రింట్!

కోర్ కమిటీ సమావేశానికి(Core meeting) ముందు అమిత్ షా, జేపీ నడ్డా, తరుణ్ చుగ్ దాదాపు 40 నిమిషాల పాటు వేర్వేరుగా సమావేశం కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా 11,000 స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, బ‌హిరంగ సభలు నిర్వహించాలని లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. ఆ మేర‌కు సునీల్ బన్సాల్ దాదాపు వారం రోజులు తెలంగాణలో ఉన్నారు. ఈ వీధి సమావేశాలకు ప్రజల స్పందన గురించి బన్సాల్ కమిటీకి తెలియ‌చేసిన‌ట్టు తెలుస్తోంది. సభల నిర్వహణ గడువు ముగియనున్నందున, తదుపరి సంస్థాగత కార్యక్రమాల బ్లూ ప్రింట్ ను ఈ స‌మావేశం సంద‌ర్భంగా రాష్ట్ర లీడ‌ర్ల‌కు అందించ‌నున్నారు. ఈ స‌మావేశానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధరంపురి, సుధాకర్ రెడ్డి-టీఎన్ కో-ఇంఛార్జి, కే లక్ష్మణ్, జీ కిషన్ రెడ్డి, ఈ సమావేశానికి విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, ఎన్‌ఇసి సభ్యుడు ఈటల రాజేంద్రన్, జి మోహన్ రావు, మురళీధర్ రావు సహా తెలంగాణ బిజెపి నేతలు కూడా హాజరయ్యారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ,తెలంగాణ ప‌రిస్థితుల‌పై కోర్ క‌మిటీ

ప్ర‌ధానంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ప‌రిణామాలు, తెలంగాణ రాష్ట్ర ప‌రిస్థితుల‌పై కోర్ క‌మిటీ స‌మావేశంలోని(Core meeting) ప్ర‌ధాన ఎజెండాగా ఉంది. త్వ‌ర‌లోనే అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రాబోతున్నారు. ఒక వేళ క‌విత‌ను సీబీఐ అరెస్ట్ చేస్తే ఏమి చేయాలి? అనే అంశంపై ఇప్ప‌టికే కేసీఆర్ ఒక వ్యూహాన్ని ర‌చించార‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకు ప్ర‌తిగా బీజేపీ వ్యూహాల‌ను సిద్ధం చేసుకోవ‌డానికి అత్య‌వ‌స‌రంగా రాష్ట్ర లీడ‌ర్ల‌కు ఢిల్లీ పిలుపు వ‌చ్చిందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి ఎక్కువ‌గా అవ‌కాశం ఉంద‌ని సంకేతాలు ఇవ్వ‌డంతో పాటు ఎన్నిక‌ల ప్ర‌చారానికి బ్లూ ప్రింట్ ను షా కోర్ క‌మిటీకి అంద‌చేసిన‌ట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ స‌మావేశం రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించేదిగా ఉంద‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం.

Also Read : BJP CM : తెలంగాణ బీజేపీ సార‌థి బండి! 12న అమిత్ షా బ‌హిరంగ స‌భ‌