T BJP : తెలంగాణ‌పై అమిత్ షా ఆప‌రేష‌న్, బండికి టార్గెట్

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ(T BJP) బ‌లోపేతం కోసం కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల

  • Written By:
  • Publish Date - April 17, 2023 / 01:40 PM IST

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ(T BJP) బ‌లోపేతం కోసం కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith shah) రంగంలోకి దిగుతున్నారు. ఈనెల 23వ తేదీన ఆయ‌న తెలంగాణ‌కు రాబోతున్నారు. ఆ సంద‌ర్భంగా ఏర్పాటు చేసే స‌భ‌లో పెద్ద ఎత్తున ఇత‌ర పార్టీల నాయ‌కులు చేర‌తార‌ని టాక్‌. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి డ‌జ‌ను మందికి త‌గ్గ‌కుండా బీజేపీలో చేరేలా ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. అందుకే, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ ను మ‌రోసారి ఢిల్లీకి పిలిపించార‌ని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బ‌లోపేతం(T BJP) 

మునుగోడు ఎన్నిక‌లు ముగిసే వర‌కు బీఆర్ఎస్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని బీజేపీ(T BJP) ప్ర‌చారం చేసింది. గ్రేట‌ర్, దుబ్బాక ఎన్నిక‌ల్లోనూ అలాంటి ప్ర‌చారం విస్తృతం చేయ‌డం జ‌రిగింది. సాక్షాత్తు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ అలాంటి వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు, కేసీఆర్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని కూడా వెల్ల‌డించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చెప్పిన మాట‌లు నిజంకాలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంద‌రు లీడ‌ర్ల‌ను బీజేపీ ఆకర్షించే ప్ర‌య‌త్నం చేసింది. ఆ క్ర‌మంలో మంత్రులు మ‌ల్లారెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్ త‌దిత‌ర‌ల‌పై ఐడీ దాడులు జ‌రిగాయ‌ని స‌ర్వ‌త్రా వినిపించింది. అయిన‌ప్ప‌టికీ బీఆర్ఎస్ నుంచి ఎవ‌రూ బీజేపీ వైపు చూడ‌లేదు.

బీజేపీ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి (T BJP) వెళ్లిన సీనియ‌ర్లు అసంతృప్తిగా ఉన్నారు. అక్క‌డ ప‌నిచేయ‌డానికి అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌తిష్ట‌ను పెంచిన ఈటెల రాజేంద్ర కూడా లోలోన అస‌హ‌నంగా ఉన్నార‌ని ఆయ‌న అనుచ‌రులు చెప్పే మాట‌. కాంగ్రెస్ నుంచి వెళ్లిన డీకే అరుణ‌, విజ‌య‌శాంతి త‌దిత‌రులు బండి సంజ‌య్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. అంతేకాదు, వాళ్ల‌కు త‌గిన ప్రాధాన్యం కూడా ల‌భించ‌డంలేదు. ఆ విష‌యాన్ని పార్టీలో చేరిన 24 గంట‌ల్లోనే దాసోజు శ్రావ‌ణ్ గ‌మ‌నించారు. అందుకే, బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయ‌న‌లాగా మ‌రికొంద‌రు బీజేపీ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు వెళ్ల‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు.

Also Read : Telangana BJP :`బండి`ప‌ద‌వికి మూడింది.?ఆప‌రేష‌న్ `షా`

ఇత‌ర పార్టీల నుంచి లీడ‌ర్ల‌ను తీసుకోవ‌డానికి ఒక క‌మిటీని బీజేపీ ఏర్పాటు చేసింది. దానికి ఈటెల‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి కీలకంగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ పెద్ద‌గా బీజేపీలో చేర‌డానికి ఇత‌ర పార్టీల లీడ‌ర్లు ముందుకు రాలేదు. ఇటీవ‌ల కాంగ్రెస్ నుంచి ఏలేటి మ‌హేశ్వ‌ర‌రెడ్డిని బీజేపీలోకి తీసుకెళ్ల‌డానికి ఈటెల రాజేంద్ర చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అయిష్టంగానే బీజేపీలో చేరిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ బ‌హిష్క‌రించిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావును కూడా బీజేపీ ఆకర్షించ‌లేక‌పోతోంది. వాళ్లు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే, నేరుగా అమిత్ షా(Amith shah రంగంలోకి దిగుతున్నారు. ఈనెల 23న ఆయ‌న హైద‌రాబాద్ వ‌స్తార‌ని తెలుస్తోంది. ఆ సంద‌ర్భంగా ఇత‌ర పార్టీల్లోని లీడ‌ర్లు డ‌జ‌ను మందికి పైగా చేరేలా ప్లాన్ చేశార‌ని వినికిడి. గ‌తంలోనూ ఇలాంటి మాట‌లు వినిపించిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో అమిత్ షా ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్నారు. ఈసారి సీరియ‌స్ గా ఉంటుంద‌ని బీజేపీ చెబుతోంది. ఎంత వ‌ర‌కు చేరిక‌లు ఉంటాయో చూద్దాం.

Also Read : BJP Mission ‘South India’: బీజేపీ ‘మిషన్ సౌత్ ఇండియా’: టార్గెట్‌ 130 సీట్లు