Munugode Bypoll: టీఆర్ఎస్ మెజార్టీకి స్వతంత్ర అభ్యర్థుల గుర్తుల దెబ్బ

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎన్నికల గుర్తయిన 'కారు'ను పోలిన స్వతంత్ర అభ్యర్థుల ఎన్నికల గుర్తులు టీఆర్‌ఎస్ విజయ పరంపరను 65శాతం తగ్గించాయి.

  • Written By:
  • Updated On - November 7, 2022 / 03:23 PM IST

టీఆర్ఎస్ మెజారిటీని స్వతంత్ర అభ్యర్ధుల ఎన్నికల గుర్తులు దెబ్బతీశాయి.
‘కారు’ను పోలిన స్వతంత్ర అభ్యర్థుల గుర్తుల వల్ల టీఆర్ఎస్ మెజారిటీ 6,500కు పడిపోయింది.

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎన్నికల గుర్తయిన ‘కారు’ను పోలిన స్వతంత్ర అభ్యర్థుల ఎన్నికల గుర్తులు టీఆర్‌ఎస్ విజయ పరంపరను 65శాతం తగ్గించాయి. బీజీపీపై 10,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించవలసి ఉండగా, కేవలం 6,544 ఓట్ల మెజార్టీకే పరిమితమైంది. కారు ను పోలిన ‘చపాతీ-మేకర్’ గుర్తుకు 2,407 మారమోని శ్రీశైలం యాదవ్ ఓట్లు పోలయ్యాయి. దాంతో టీఆర్ఎస్ మెజార్టీ తగ్గినట్లు భావిస్తున్నారు. మరో రెండు రోడ్ రోలర్, చెప్పల్స్ గుర్తులకు వరుసగా 1,874 ఓట్లు, 2,270 ఓట్లు పోలయ్యాయి. ‘కెమెరా’, ‘రూమ్ హీటర్’ గుర్తులకు 500, 400 ఓట్లు వచ్చాయి. కారు’ను పోలిన ఎన్నికల గుర్తులను తొలగించాలన్న తమ అభ్యర్థనపై ఎన్నికల సంఘం (ఈసీఐ) చర్యలు తీసుకుని ఉంటే తమ పార్టీ ఇంకా అధిక మెజారిటీతో విజయం సాధించేదని టీఆర్‌ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

కారును పోలిన స్వతంత్రుల గుర్తులను జాబితా నుంచి తొలగించాలని టీఆర్‌ఎస్‌ ఎన్నికల సంఘాన్ని, హైకోర్టును కోరింది. ఎన్నికలకు ముందే పార్టీ పోల్ ప్యానెల్‌ను ఆశ్రయించి కోర్టులో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. రోడ్ రోలర్, చపాతీ మేకర్, కెమెరా, డోలీ, సోప్ డిష్, టెలివిజన్, కుట్టు యంత్రం, ఓడ వంటి గుర్తులపై టీఆర్‌ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చపాతీ మేకర్‌ను సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అభ్యర్థి మారమోని శ్రీశైలం యాదవ్‌కు కేటాయించగా, యుగ తులసి పార్టీకి చెందిన కె.శివకుమార్‌కు ‘రోడ్‌ రోలర్‌’ గుర్తును కేటాయించారు. మరో స్వతంత్ర అభ్యర్థి ఎరుపుల గాలయ్యకు ‘చెప్పల్స్’ గుర్తు లభించింది.

బీజేపీ ఇండిపెండెంట్లను రంగంలోకి దింపి వారికి ‘కారు’ను పోలిన గుర్తులు వచ్చేలా చూసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘‘2011లో ఉచిత చిహ్నాల జాబితా నుంచి తొలగించిన ‘రోడ్ రోలర్’ గుర్తుపై మేము అభ్యంతరాలను లేవనెత్తాం. కానీ, మునుగోడు ఉప ఎన్నికలో అదే గుర్తు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ గుర్తులు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఉండి ఉంటే టీఆర్‌ఎస్‌ మెజారిటీ 17వేలు దాటి ఉండేది’’ అని కేటీఆర్‌ అభిప్రాయ పడ్డారు. ఈ గుర్తుల కారణంగా తమకు నష్టం జరిగే అవకాశం ఉందని ముందే ఊహించిన టీఆర్ ఎస్ ఓటర్లకు అవగాహన కల్పించేందుకు డమ్మీ ఈవీఎంలతో ప్రచారం నిర్వహించడంతో కొంత మేర నష్టనివారణ చేసుకోగలిగిందని భావిస్తున్నారు.