Swiggy: సమ్మెబాటలో స్విగ్గీ బాయ్స్.. అసలు డిమాండ్స్ ఇవే..!

పోటీప్రపంచంలో ప్రతిఒక్కరి బిజీబిజీ జీవితాలను గడుపుతున్నారు. కాలంతో పోటీ పడుతూ పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కడుపు నిండా భోజనం చేయాల్సిన సందర్భాలు సైతం ఎదుర్కొంటున్నాం.

  • Written By:
  • Updated On - November 29, 2021 / 02:50 PM IST

పోటీప్రపంచంలో ప్రతిఒక్కరి బిజీబిజీ జీవితాలను గడుపుతున్నారు. కాలంతో పోటీ పడుతూ పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కడుపు నిండా భోజనం చేయాల్సిన సందర్భాలు సైతం ఎదుర్కొంటున్నాం. ఉదయాన్నే లేస్తూనే ఆఫీసులకు, ఏ రాత్రి అయితేనే ఇళ్లకు చేరుకోలేం. ఈ క్రమంలో ఇష్టమైన ఫుడ్ తినలేక అర్దాకలితో ఉద్యోగాలు, వివిధ పనులు చేసేవాళ్లు ఎంతోమంది. అలాంటివాళ్ల కోసమే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సేవలు పుట్టుకొచ్చాయి. నిమిషాల్లో ఆర్డర్ మన ముంగింట్లోకి వచ్చేస్తుంది. ఎండనక, వాననక సేవలను అందిస్తుంటే.. కనీస చార్జీలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని వివిధ ఏరియాల్లో పనిచేసే స్విగ్గీ డెలివరీ బాయ్స్ స్ట్రయిక్ కు సిద్ధమయ్యారు.

పనికి తగ్గ ప్రతిఫలం దొరకట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై  యాజమాన్యానికి లెటర్ రాసి, వారం రోజుల గడువు ఇచ్చామని, తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి సరైనరీతిలో స్పందన రాకపోతే సమ్మె చేస్తామన్నారు. ప్రస్తుతం నల్లబ్యాడ్జీలు ధరించి మధ్యాహ్నం సమయాల్లో నిరసన తెలుపుతున్నామని, డిసెంబర్‌ 5వ తేదీ నుంచి పూర్తి స్థాయి సమ్మెకు వెళ్తామని ప్రకటించారు. పెట్రోల్‌ ధరలు పెరిగినా డెలివరీ పర్సన్స్ కి చెల్లించాల్సిన చార్జీల్లో ఎలాంటి మార్పు రాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీకి సబంధించి కేవలం హోటల్‌ నుంచి కస్టమర్‌ చిరునామాకు కిలోమీటర్ల లెక్కతో చార్జీలు ఇస్తున్నారని, అపార్ట్‌మెంట్లలో మెట్లెక్కి దిగడం వంటి పనులకు రుసుం చెల్లించడం లేదన్నారు. కస్టమర్‌ దగ్గర నుంచి తిరిగి హోటల్‌కు రావడానికి అయ్యే ఖర్చునూ జమ కట్టడం లేదని దింతో చాలా నష్టపోతున్నామని తెలిపారు.

డిమాండ్స్ ఇవే…

  1. డెలివరీ కనీస చార్జి రూ. 35గా ప్రకటించాలి
  2. బ్యాచ్‌ ఆర్డర్‌ చెల్లింపులను రూ. 20కి పెంచాలి
  3. కస్టమర్‌ డోర్‌ స్టెప్‌ డెలివరీ చార్జీ రూ.5లను పునరుద్ధరించాలి
  4. ప్రతి కిలోమీటర్‌కు చెల్లించే మొత్తాన్ని రూ. 6 నుంచి రూ. 12కు పెంచాలి
  5. ప్రతినెలా ఇచ్చే రేటింగ్‌ ఇన్సెంటివ్స్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలి
  6. డెలివరీ పరిధిని తగ్గించడానికి సూపర్‌ జోన్స్‌ తీసేయాలి