Site icon HashtagU Telugu

Swachh Danam Pachadanam Programme : బేగంపేటలో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’’ డ్రైవ్‌

Swachh Danam Mahadanam Prog

Swachh Danam Mahadanam Prog

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించడానికి నగరవ్యాప్తంగా ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ (Swachh Danam Pachadanam Programme) కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఐదు రోజుల పాటూ సాగే కార్యక్రమాలు నిన్న సోమవారం మొదలుపెట్టారు. నగరంలో పరిశుభ్రత మరియు పచ్చదనంపై నగరవాసుల్లో అవగాహనా కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు శాఖల వారీగా సమన్వయంతో పని చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాటా (GHMC Commissioner Amrapali Kata ) అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా చురుగ్గా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. నగరంలోని మొత్తం 150 వార్డుల్లో ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు వివిధ శాఖల వారీగా కలిసి పనిచేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెత్తను తొలగించడం, నిర్మాణ శిథిలాలు, నీటి వనరులను శుభ్రపరచడం మరియు నాలాలు వంటి కార్యకలాపాలు చేపట్టనున్నారు. అలాగే ‘వనమహోస్త్వం’ పేరుతో చెట్లను నాటనున్నారు. తొలిరోజు చెత్త, నిర్మాణ వ్యర్థాలను తొలగించడం, చెత్త రహిత రోడ్లు, జీరో వేస్ట్ మార్కెట్ల ఏర్పాటుకు మార్కెట్ కమిటీల ఏర్పాటు వంటివి చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు (2nd డే) దోమల నివారణ, కుక్కలకు వ్యాక్సినేషన్ మరియు వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వంటి ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో GHMC జోనల్ కమిషనర్ ఎన్.రవి కిరణ్ (GHMC Zonal Commissioner N. Ravi Kiran) పర్యవేక్షణలో నగరంలోని ప్రకాష్‌నగర్, బేగంపేట లో ‘స్వచ్ఛదానం-పచ్చదనం’ డ్రైవ్‌ నిర్వహించారు. చెత్తను క్లిన్ చేయడం తో పాటు దోమల స్ప్రేలు చేసారు. అలాగే పలు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్ సుదం, షేక్ గౌస్, అరుణ్, బాలు, శేఖర్, కృష్ణ, గోవింద్ లతో పాటు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ వి.సమ్మయ్య, డిప్యూటీ ఇంజనీర్‌ శ్రీనివాస్‌రావు, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఆండాల్‌, శానిటేషన్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Read Also : Rahul Gandhi : బంగ్లాదేశ్‌ పరిస్థితలపై కేంద్రానికి రాహుల్‌ గాంధీ ప్రశ్నలు