Site icon HashtagU Telugu

Death : హోట‌ల్ గ‌దిలో ఐఐటీ గౌహ‌తి విద్యార్థిని అనుమాన‌స్ప‌ద మృతి.. ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు

Fire Accident

Dead Body

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-గౌహతిలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఓ హోటల్‌లో శవమై కనిపించింది. మృతురాలు తెలంగాణకు చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. ఆమె త‌న ముగ్గురు స్నేహితుల‌తో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి డిసెంబర్ 31 సాయంత్రం ఇన్‌స్టిట్యూట్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌహతికి వచ్చారు. వారు ఆన్‌లైన్ ద్వారా ఒక హోటల్‌లో రెండు గదులను బుక్ చేసుకున్నారు. అర్ధరాత్రి తరువాత వారు చెక్-ఇన్ కోసం హోటల్‌కు చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను అదే గదిలో ఉంటున్న ఆమె స్నేహితురాలు గుర్తించింది. ఆమెను గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆమె స్నేహితులందరినీ విచారిస్తున్నామని.. ఇతర వ్యక్తులను కూడా ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతురాలు.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఐశ్వర్య పుల్లూరిగా గుర్తించారు. ఆమెతో పాటు మరో యువ‌తి, ఇద్దరు విద్యార్థులు హోటల్‌లో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. కాగా విద్యార్థి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఐఐటీ-గౌహతి ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31న IIT గౌహతి క్యాంపస్ వెలుపల విద్యార్థిని మరణించ‌డం దృర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొంది. పోలీసులు ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని తెలిపింది.

Also Read:  apan Plane: మంటల్లో చిక్కుకున్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం.. ఐదుగురు సిబ్బంది మృతి, ప్రధాని విచారం..!