Suspicious Bag Stir : సీఎం రేవంత్ నివాసం (CM Revanth Reddy House) వద్ద కలకలం రేపిన బ్యాగ్ (Suspicious Bag) మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు , బిజినెస్ రంగ ప్రముఖులకు బాంబ్ బెదిరింపులు అనేవి నిత్యం జరుగుతూనే ఉంటాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి జల్లాడ పడుతుంటారు. తీరా స్పాట్ కి వెళ్లిన తర్వాం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకుంటారు. తాజాగా రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి వద్ద బ్యాక్ కలకలం రేపింది.
జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి అతి సమీపంలో ఓ బ్యాక్ తీవ్ర కలకలం సృష్టించింది. అనుమానాస్పద బ్యాగ్ గా గుర్తించి చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యింది. ఇంటెలిజెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న ఇంటెలిజెన్స్ విభాగం ఆ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. మరోచోట కు తీసుకెళ్ళి చూసారు. అయితే అందులో డమ్మీ బాంబు ఉన్నట్లు గుర్తించారు. సినిమా షూటింగ్ కోసం దీన్ని తయారు చేసిన ఓ వ్యక్తి తన బైక్ డిక్కీలో పెట్టాడు. అయితే ఆ బైక్ను తీసుకెళ్లిన అతడి ఫ్రెండ్ డిక్కీలో నిజమైన బాంబ్ ఉందనుకొని తెలియకుండా రేవంత్ నివాసం సమీపంలో పడేశాడు. ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు చెప్పడంతో బ్యాగ్ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు. ప్రస్తుతం ఆ బాంబ్..డమ్మీదని తెలిసి హమ్మయ్య అనుకుంటున్నారు.
ఇక తెలంగాణ రాజకీయాల విషయం చెప్పాల్సిన పనిలేదు. ప్రతి నిత్యం అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం చేసే పనులపై విమర్శలు, ఆరోపణలు బిఆర్ఎస్ చేయడం..దానికి కాంగ్రెస్ కౌంటర్లు ఇవ్వడం కామన్ గా మారింది. ఈరోజు కూడా అదే జరిగింది. నిన్న సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఫై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ఇటు రేవంత్ కూడా ఈరోజు ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో కేసీఆర్ , కేటీఆర్ లపై చివాట్లు పెట్టాడు.
Read Also : Jio Services Down : జియో సేవల్లో అంతరాయం.. వేలాదిగా ఫిర్యాదుల వెల్లువ