Site icon HashtagU Telugu

TG Assembly : జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి – స్పీకర్ కు బిఆర్ఎస్ వినతి

Brs Request Speaker To Revo

Brs Request Speaker To Revo

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సస్పెన్షన్ (Suspension) అంశం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్(BRS) పార్టీ ఈ నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలని స్పీకర్‌ను కోరింది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్ చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేసింది. జగదీష్ రెడ్డి అసెంబ్లీలో ఏకవచనంతో మాట్లాడలేదని, ఆయనకు వివరణ చెప్పే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.

Janasena Formation Day : మరోసారి జనసేన శ్రేణులను నిరాశ పరిచిన పవన్

జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ పట్ల ఆయన అమర్యాదగా ప్రవర్తించలేదని, ఎటువంటి వివరణ లేకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా సస్పెన్షన్ విధించిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ అంశంపై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాన్ని కానీ పార్టీ వివరణను కానీ తీసుకోకుండా ప్రభుత్వం తాము అనుకున్నట్లు నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభలో వివరణ ఇవ్వనున్నారు. అదనంగా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి పేరుగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విభజన చట్టం ప్రకారం యూనివర్సిటీ పేరును మార్చాలని తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.