Site icon HashtagU Telugu

Punjagutta: డబ్బులకు ఆశపడి కటకటాల పాలైన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్

Punjagutta

Punjagutta

Punjagutta: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌తో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా కనిపించకుండా పోయినట్లు సమాచారం అందడంతో హైదరాబాద్‌ పోలీసులు అతడిని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని గుంతకల్‌లో అరెస్టు చేశారు. దుర్గారావు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటీషన్‌ దాఖలు చేయగా, పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు.

డిసెంబరు 24న ప్రజా భవన్ వెలుపల డివైడర్‌ని ఢీ కొట్టాడు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ కుమారుడు రహీల్ అమీర్‌. తాగి డ్రైవింగ్ చేసిన కేసునుండి తప్పించుకోవడానికి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావుతో డీల్ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత రాహిల్‌ తన తండ్రితో కలిసి దుబాయ్‌కి వెళ్లిపోయాడు. మాజీ ఎమ్మెల్యేతో కుమ్మక్కయ్యాడని ఆరోపణల నేపథ్యంలో దుర్గారావు కూడా పరారయ్యాడు. అయితే తాజాగా ఏపీలో పట్టుబడ్డాడు.

కేసు విషయానికి వస్తే రహీల్ కారు యాక్సిడెంట్ చేసి తప్పించుకున్న కొన్ని గంటల తర్వాత అబ్దుల్ ఆరిఫ్ అనే వ్యక్తి నేనే కారు యాక్సిడెంట్ చేశానని పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో అతడినే నిందితుడిగా పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి అనుమానాస్పదంగా గుర్తించారు. తదుపరి విచారణలో షకీల్ మరియు దుర్గ రావు మధ్య ఫోన్ కాల్ కనుగొన్నారు. దీంతో విచారిస్తే అసలు సంగతి బయటపడింది.

Also Read: Free Sewing Machine : ఉచితంగా కుట్టుమిషన్, పెట్టుబడికి రూ.20వేలు .. అప్లై ఇలా