మూసీ నది (Musi ) ప్రక్షాళనను పేరుతో కాంగ్రెస్ సర్కార్ (Telangana Govt)..మూసీ నిర్వాసితులను ఖాళీ చేసేందుకు సిద్ధమైంది. మూసీ వద్ద ఉన్న ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఈరోజు మూసీ నిర్వాసితుల గుర్తింపు కోసం సర్వే మొదలుపెట్టారు. పునరావాసం కోసం పేదల వివరాల సేకరించే పనిలో భాగంగా అధికారులు మూసి పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లారు. పునరావాసం తర్వాతే ఇళ్ళు కూలుస్తామని… అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తామని చెప్పుకొచ్చారు.
మూసీ బాధితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగగా.. నివాసులు అడ్డుకుంటున్నారు. మూసీ రివర్ బెడ్‌లో 25 ప్రత్యేక సర్వే బృందాలను ఎక్కడిక్కడే అడ్డుకొని బూతులు దండకం మొదలుపెట్టారు. తాము కూల్చేందుకు రాలేదని, కేవలం వివరాలు తీసుకుని వెళ్లిపోతామని అధికారులు చెప్పినా ససేమిరా అంటూ అడ్డం తిరిగారు. అధికారులను అడ్డుకున్న స్థానికులు.. ఎవరు ఏం చెప్పినా.. ఎన్ని నోటీసులు ఇచ్చినా తాము తమ ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తి లేదని..తమ ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తమ ఇంటిపై చెయ్యి వేస్తే పెట్రోల్ పోసుకొని చనిపోతామని బెదిరించారు. ఇలా ఎక్కడిక్కడే స్థానికులు అడ్డుకోవడం తో అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు.
ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి పునరావాసం కల్పిస్తామని, దాదాపు 15 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకై సంబంధిత జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also : KBC 16 Crorepati : ‘కౌన్ బనేగా కరోడ్‌పతి-16’లో తొలి కోటీశ్వరుడు ఈ కుర్రాడే..