Site icon HashtagU Telugu

Supreme Court : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court issues key orders on party defections

Supreme Court issues key orders on party defections

Supreme Court : నేడు సుప్రీంకోర్టు మరోసారి తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసును విచారించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 25లోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు నోటీసులు అందాయి. అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది.

Read Also: Leader : లోకేష్‌ ప్రెజెంటేషన్‌ అదుర్స్‌…. విమర్శకుల ప్రశంసలు…!!

కాగా, కాంగ్రెస్ పార్టీ లో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. జనవరి 15న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌‌పై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌‌‌‌ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్‌‌‌‌ లీవ్‌‌‌‌ పిటిషన్‌ (ఎస్‌‌‌‌ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ఎం.సంజయ్‌‌‌‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌‌‌‌ రెడ్డి, ప్రకాశ్​గౌడ్, గూడెం మహిపాల్‌‌‌‌ రెడ్డి, అరికపూడి గాంధీపై కేటీఆర్ రిట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. అయితే, అన్ని పిటిషన్లను ఒకే దగ్గర కలిపి సుప్రీం ధర్మాసనం విచారణ చేపడుతోన్న విషయం తెలిసిందే.

Read Also: Assembly : అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌..