తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి సుప్రీం కోర్ట్ (Supreme Court ) భారీ షాక్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసు (Vote for Note Case)లో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు (Supreme Court Issued Notice) జారీ చేసింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.
ఓటుకు నోటు కేసులో A-1 నిందితుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉన్నందున కేసు విచారణ సరిగా సాగే అవకాశం లేదని పిటషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ .. పిటీషన్ లో పలు ఉదంతాలను కూడా ఉదాహరించటం గమనార్హం. కాగా.. రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని పిటీషన్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి..గతంలో టీడీపీలో ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్‌సన్‌ను రేవంత్ రెడ్డి కలిసి.. డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత బెయిల్ మీద రేవంత్ రెడ్డి బయటకు రాగా… తర్వాత జరిగిన పరిణామాలతో ఈ కేసు కాస్త మరుగున పడిపోయింది. అయితే.. మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే.. ఈ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
Read Also : Ravindra Jadeja : కోడలిపై జడేజా తండ్రి సంచలన ఆరోపణలు…రచ్చకెక్కిన క్రికెటర్ కుటుంబ విభేదాలు