Site icon HashtagU Telugu

HCA : హెచ్‌సీఏ క‌మిటీని ర‌ద్దు చేసిన సుప్రీం కోర్టు.. ఎన్నిక‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు రిటైర్డ్ జ‌స్టిస్ లావు నాగేశ్వ‌ర‌రావు నియామ‌కం

Hca Imresizer

Hca Imresizer

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క‌మిటీని సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. ఎన్నికలను పర్యవేక్షించేందుకు రిటైర్డ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావును సుప్రీంకోర్టు నియ‌మించింది. ప్రస్తుత ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నా, ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, మనోజ్ మిశ్రా, అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ చార్మినార్ క్రికెట్ క్లబ్ ల మధ్య కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెల్ల‌డిచింది. హెచ్‌సీఏ క‌మిటీని రద్దు చేస్తు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామ‌ని హెచ్‌సీఏ సెక్రటరీ విజయానంద్ తెలిపారు. 1934 లో ఏర్పడ్డ హెచ్‌సీఏను రద్దు ఇదే తొలిసారి అని.. జస్టిస్ లావు నాగేశ్వర‌రావు ను నియమించడం సంతోషంగా ఉంద‌న్నారు. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికలు 2022 సెప్టెంబర్ 27 న టర్మ్ అయిపోయిందని.. అయినా కూడా అధ్యక్షులు అజరుద్దీన్ కొనసాగార‌ని ఆయ‌న ఆరోపించారు. ఆజారుద్దీన్ హెచ్‌సీఏలో అంతర్గత కుమ్ములాట తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికలకు వెళ్లాలని అనేకసార్లు చెప్పినా పట్టించుకోలేదని.. సుప్రీంకోర్టును కేసులు సాకుగా చూపి రెండు మ్యాచ్లు నిర్వహించార‌ని విజ‌యానంద్ ఆరోపించారు. జరిగిన రెండు మ్యాచ్లో కూడా అనేక ఆరోపణలు వచ్చాయ‌ని.. మంత్రులు ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావించడం హెచ్‌సీఏ తీరుకు నిదర్శనమ‌న్నారు. ఇప్పటికైనా అందరం కలిసి కట్టుగా పనిచేసి.. హెచ్‌సీఏ కు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నాన‌న్నారు.