సుప్రీం కోర్ట్ ఓటుకు నోటు కేసు (Note For Vote Case )పై విచారణను వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను చేర్చాలి అంటూ సుప్రీం కోర్టు (Supreme Court)లో ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లు వేశారు రామకృష్ణ. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఒక పిటిషన్ వేయగా.. తెలంగాణ ఏసీబీ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో చంద్రబాబు తరపున వాదించే సిద్దార్థ్ లూత్రా అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్టుగా తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సమయంలో ప్రస్తుత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి డబ్బులిస్తూ దొరికినట్టుగా అప్పట్లో ఏసీబీ ప్రకటించింది. కానీ ఈ ఆరోపణలను రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంత కాలం జైల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టులో లిస్టైంది. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు అందుబాటులో లేని విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తేవడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.
Read Also : Bail Granted : రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్