Site icon HashtagU Telugu

Sunitha Laxma Reddy: నర్సాపూర్ BRS అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ఫిక్స్, బీ ఫామ్ అందజేత

Sunitha Laxma Reddy

Sunitha Laxma Reddy

Sunitha Laxma Reddy: నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి ని బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్థుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారితో కలిసి ఆమెకు బీఫామ్ అందచేశారు. అదే సందర్భంగా ప్రస్థుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డి కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బిఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు  నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏకగ్రీవంగా బిఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల  సిఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…‘‘ మదన్ రెడ్డి గారు నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్లనుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ  ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియారిటిని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ మఖ్య కర్యవర్గాన్ని అభినందిస్తున్నాను.

మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్ లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడు సౌమ్యుడు  మదన్ రెడ్డి గారి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సివుంది. నాతో పాటు కలిసి సునీతకు నర్సాపూర్ నియోజకవర్గ బీఫామ్ ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు.వారికి నా ధన్యవాదాలు అభినందనలు ’’ అని బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు తదితరులున్నారు.