Site icon HashtagU Telugu

BRS: బీఆర్‌ఎస్‌ పార్టీకి సునీత మహేందర్ రెడ్డి రాజీనామా

Sunita Mahender Reddy Resigned From Brs Party

Sunita Mahender Reddy Resigned From Brs Party

 

Sunita-Mahender-Reddy : బీఆర్‌ఎస్‌(brs) పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి సతీమణీ సునీత మహేందర్(Sunita-Mahender-Reddy) రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్‌(kcr) కు రాజీనామా లేఖ పంపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి సతీమణీ సునీత మహేందర్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ(congress) ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇందులో భాగంగానే..బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి సతీమణీ సునీత మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు. కాగా, ఈరోజు గులాబీ పార్టీ నుంచి మరో నలుగురు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారు.

read also : Medaram Jatara:ఇక పై మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు