Sunil Kanugolu : కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాలలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు. ఈయన 2024 లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన టీమ్‌లో ఉండరని తెలుస్తోంది. ఈసారి ఆయన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచార బాధ్యతలను చూస్తారని అంటున్నారు. బీజేపీ బలంగా ఉన్న ఈ రాష్ట్రాల్లో ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకునే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో సునీల్ కనుగోలు ఎన్నికల స్ట్రాటజీని అమలు చేసేందుకు అక్కడి సీనియర్ నేతలు నో చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
రాజస్థాన్‌లో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సీఎం భూపేష్ బఘేల్ అన్నీ తామై వ్యవహరించారు. సునీల్ కనుగోలు(Sunil Kanugolu) ఇచ్చిన సూచనలను పెడచెవిన పెట్టారు. ఫలితంగా ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. సునీల్ సూచనలను అమలు చేసిన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రం హస్తం పార్టీకి విజయం చేజిక్కింది. ప్రస్తుతం సునీల్ కనుగోలు.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాథమిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈసారి కీలకమైన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల బాధ్యతలను ఆయనకు అప్పగించే ఛాన్స్ ఉందట.మహారాష్ట్ర, హర్యానాలలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. దేశంలో లోక్‌సభ సీట్ల సంఖ్యపరంగా మహారాష్ట్ర రెండో ప్లేసులో ఉంది. ఈ రెండుచోట్ల బీజేపీని వీక్ చేయగలిగితే.. ఉత్తరాదిపై తమకు పట్టుచిక్కుతుందనే వ్యూహంతో కాంగ్రెస్ ఉంది. అందుకే అక్కడి బాధ్యతలను సునీల్ కనుగోలుకు ఇస్తారని అంటున్నారు.
Also Read: Childs Study Table : ఇంట్లో పిల్లల స్టడీ టేబుల్ ఎలా ఉండాలో తెలుసా ?
తెలంగాణలో కర్ణాటక సీన్ రిపీట్
తెలంగాణలో రూ.500లకే గ్యాస్ సిలెండర్, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 , ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతుభరోసా కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.15వేలకు పెంచడం, కౌలు రైతులకూ ఈ పథకం వర్తింపజేయడం, వ్యవసాయ కార్మికులకు రూ.12వేలు, వరిపంటకు ఏడాదికి రూ. 500 బోనస్, గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి రూ. 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వడం, ఇందిరమ్మ ఇళ్ళు, యువ వికాసం, చేయూత పథకాలతో కాంగ్రెస్ పార్టీ సామాన్యల మనసు గెలుచుకునేలా మేనిఫెస్టో రూపొందించడంలో సునీల్ పాత్ర ఉందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్న మాట. అలాగే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బీజేపీతో కుమ్మక్కయ్యారని ప్రచారం చేసి, మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేయడంలోనూ సునీల్ పాత్ర ఉందని చెపుతారు. కానీ, తెలంగాణలో మాదిరిగా చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఆయన వ్యూహాలు పని చేసినట్టు కనిపించడం లేదు.సునీల్ కనుగోలుపై వివాదాలు కూడా ఉన్నాయి. 2022 డిసెంబరులో తెలంగాణ పోలీసులు ఈయన కార్యాలయం మైండ్ షేర్ ఎనలిటిక్స్ పై దాడిచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవానికి భంగం కలిగించే రీతిలో సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారంటూ కేసు నమోదు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ దీనిని రాజకీయ ప్రతీకార చర్య అని పేర్కొంది.