డిసెంబర్ 31 వేడుకలకు హైదరాబాద్ (Hyderabad) నగరం సిద్దమవుతుంది. ఇప్పటీకే పలు రెస్టారెంట్స్ , హోటల్స్ , క్లబ్స్ ఇలా అన్ని కూడా న్యూ ఇయర్ (New Year Celebrations ) వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకునే పనిలో ఉన్నాయి. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఇతర రాష్ట్రాల వారు సైతం హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. అయితే ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు సంబధించి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.
ముఖ్యంగా డ్రగ్స్ (Drugs) కు హైదరాబాద్ అడ్డాగా మారిందనే విమర్శల నేపథ్యంలో హైదరాబాద్ లో డ్రగ్స్ అనే మాట వినిపించకుండా చూడాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేసారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ నడుస్తుందనే కోణంలో పలు ఆంక్షలు విధిస్తున్నారు. అందులో భాగంగా ‘సన్ బర్న్’ (Sunburn )కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. అనుమతుల్లేకుండా పార్టీలు నిర్వహిస్తున్న సన్ బర్న్ పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సన్ బర్న్ పార్టీకి సంబంధించి డిజిటల్ మార్గంలో టికెట్లు అమ్ముతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బుక్ మై షో లాంటి కొన్నింటిని నేను స్వయంగా గమనించిన.. వాళ్లు ప్రభుత్వ అనుమతి పొందలేదు.. అనుమతి పొందకుండా డిసెంబర్ 31 రాత్రి సన్ బర్న్ పార్టీకి సంబంధించి టికెట్లు విక్రయిస్తున్నారు. దీనిపై సైబరాబాద్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ తరుణంలో సిటీలో ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ పై ఫోకస్ చేశారు పోలీసులు. ఈ సారి న్యూ ఇయర్ కి సన్ బర్న్ కి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్న సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి…. సన్ బర్న్ ఈవెంట్ కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదని వివరించారు. అనుమతి తీసుకోకుండా.. ఆన్లైన్ లో టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని.. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామని తెలిపారు.
Read Also : Medigadda Project : ఈ నెల 29న మేడిగడ్డకు ఉత్తమ్, శ్రీధర్‌బాబు