Site icon HashtagU Telugu

Summer Effect : TSRTC కీలక నిర్ణయం

Tsrtcsummer

Tsrtcsummer

వామ్మో ఏంటి ఈ ఎండలు (Temperature) ఏప్రిల్ లోనే నిప్పుల కొలిమిలా ఉన్నాయి. మే నెలలో ఇంకెలా ఉండబోతాయో..? అని రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత చూసి ప్రజలు భయపడుతున్నారు. మార్చి రెండో వారం వారం నుండే భానుడి భగభగమంటున్నాడు. గత 15 రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 10 దాటినా తర్వాత బయటకు వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు..కానీ బయటకు వెళ్లనిదే పనులు జరగవు. ఏదైనా పని ఉన్నప్పటికీ ఉదయమే చూసుకుంటున్నారు..లేదా సాయంత్రం వేళా చూసుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ ఎండలకు ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైన ఎండ , కింద ఇంజన్ వేడితో డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో వారంతా వడదెబ్బకు గురి అవ్వడం , లేదా ఇతర అనారోగ్య సమస్యలకు గురి అవ్వడం జరుగుతుంది. ఇలా రోజు రోజుకు సిబ్బంది అనారోగ్యానికి గురి అవుతుండడం తో TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిలో మధ్యాహ్నం వేళా బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ లో బస్సులు నడపడం అనేది డ్రైవర్లకు తీవ్ర ఇబ్బంది గా ఉంటుంది. నిత్యం ట్రాఫిక్ జాం లు అవుతుంటాయి..ఈ క్రమంలో ఎండ తీవ్రత కూడా మధ్యాహ్నం వేళ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో వారు బస్సులను నడపాలంటే చాల ఇబ్బంది గా ఉంటుంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్‌లో మధ్యాహ్నం వేళ బస్సులను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి (ఏప్రిల్ 17) మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. మధ్యాహ్నం వేళ ప్రయాణికులు లేక పోవడంతో పాటు , డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండడం తో సర్వీసులను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Read Also : Charlie Chaplin Birthday Today : మాట్లాడకుండా ..పొట్టచెక్కలు చేస్తాడు