తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ పై మాజీ మంత్రి మరియు బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సమ్మిట్‌ను పెట్టుబడులను ఆకర్షించే గ్లోబల్ ఈవెంట్‌గా కాకుండా, భూములను అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో లాగా ఉందని ఆయన ఆరోపించారు. ‘ఫ్యూచర్ సిటీ’ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమం, గతంలో జరిగిన అందాల పోటీలు లేదా ఏఐ సమ్మిట్‌ల మాదిరిగానే అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిందని ఆయన ఎద్దేవా చేశారు. విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌పై కూడా హరీష్ రావు ప్రశ్నలు సంధించారు. అందులో ‘విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు’ అని, అది అక్షరాలు, అంకెలు, రంగురంగుల పేజీలతో కూడిన అర్థం లేని అబద్ధాల డాక్యుమెంట్ అని కొట్టిపారేశారు. ఈ సమ్మిట్ కేవలం రెండేళ్ల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన పీఆర్ స్టంట్ మాత్రమేనని ఆయన ఆరోపించారు.
Fire Accident : ఆర్‌కే బీచ్ పరిసర ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదం
ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని, ఆ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసమే గ్లోబల్ సమ్మిట్ అంటూ రేవంత్ రెడ్డి ఒక ‘బయో స్కోప్ సినిమా’ చూపించారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో భూముల స్కాం, పవర్ స్కాం, లిక్కర్ స్కాం అయ్యిందని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్కాంకు తెరతీశారని అన్నారు. ఫ్యూచర్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కోసమే ఈ సమ్మిట్ పెట్టారని, ఫార్మా సిటీ పక్కన ఉన్న భూములను ముందే బినామీలతో కొనిపించి, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఆ భూములను తెగ నమ్మడానికి ప్లాన్ వేశారని ఆయన విమర్శించారు. అంతేకాక 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5 వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తారని ప్రభుత్వం ప్రచారం చేసినప్పటికీ, ఒక్క ముఖ్యమంత్రి కూడా రాలేదని, ఎంబీఏ విద్యార్థులను, కాంగ్రెస్ నాయకులను కోట్ వేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారని హరీష్ రావు విమర్శిస్తూ, ఇది గ్లోబల్ సమ్మిట్ కాదని, లోకల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో అని ఎద్దేవా చేశారు.
Kids Health: చిన్నపిల్లలకు దగ్గు జలుబు ఉన్నప్పుడు అరటిపండు పెట్టకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
చివరగా హరీష్ రావు గత పెట్టుబడుల హామీలు మరియు అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై కేంద్రీకరించారు. గతంలో దావోస్, ఏఐ సమ్మిట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటనల ద్వారా ప్రకటించిన రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన సీఎంను నిలదీశారు. నిన్నటి సమ్మిట్‌లో 5 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం, రెండేళ్ల కాలంలో తెచ్చిన మొత్తం పెట్టుబడులు, గ్రౌండ్ అయిన కంపెనీలు, మరియు వచ్చిన ఉద్యోగాలపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పి, ఇప్పుడు మళ్లీ ఫ్యూచర్ సిటీ పేరుతో ఒకే ప్రాంతంలో పరిశ్రమలను కేంద్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. చివరగా, సమ్మిట్‌లో టోనీ బ్లెయిర్, దువ్వూరి సుబ్బారావు లాంటి ప్రముఖులు సైతం పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని కొనియాడారని గుర్తు చేస్తూ, తన చెత్త విధానాలతో కేసీఆర్ చేసిన అభివృద్ధిని నాశనం చేయవద్దని, చేతనైతే ఆ అభివృద్ధిని కొనసాగించి చూపాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
