Suicide: హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి 20 ఏళ్ళ యువతీ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడిన యువతీ పాయల్ గా గుర్తించారు పోలీసులు. ఆమె కర్ణాటకలోని గుల్బర్గా నివాసి. అయితే హైదరాబాద్ లోని మాదాపూర్ లో ప్రస్తుతం నివాసం ఉంటుంది. పాయల్ ఈ రోజు మధ్యాహ్నం మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డీమార్ట్ కు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అటుగా దుర్గం చెరువు మీదుగా కేబుల్ బ్రిడ్జిపైకి ఎక్కి ఆత్మహత్యకు పాల్పడింది. మాదాపూర్ పోలీసులు పాయల్ ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అటు జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More: Ankitha : ఎన్టీఆర్‌తో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఏం చేస్తుందో..? ఎక్కడ ఉందో తెలుసా..?