Site icon HashtagU Telugu

CM Revanth: సీఎం రేవంత్‌లో సడెన్ ఛేంజ్‌.. మంత్రులు, ఎమ్మెల్యేల‌కు క్లాస్‌!

Telangana Government

Telangana Government

CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేకాకుండా కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌న‌న‌కు క‌ల‌వ‌డానికి వ‌చ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుల‌కు గ‌ట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వారికి సీఎం రేవంత్ దిశానిర్దేశం కూడా చేసిన‌ట్లు స‌మాచారం.

సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నేను మారాను మీరు మారండి. అందరు మంత్రులకు నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినా. ఎమ్మెల్యేల పని తీరు, ప్రోగ్రెస్‌పై సర్వే రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించా. అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండండి. ఏడాది పాలనలో మనకు తెలిసి తప్పు చేయలేదు. తెలియకుండా జరిగిన తప్పులపై చర్యలు తీసుకున్నాం. ఏడాది పాలన అనుభవాలు వచ్చే నాలుగేళ్లకు ఉపయోగపడతాయన్నారు. అయితే అంగ‌న్వాడీ డీలర్ల నియామకంలో పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వండని సీఎంని ఓ మంత్రి కోరిన‌ట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా నియామకాలు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని సీఎం రేవంత్ అన్న‌ట్లు స‌మాచారం. ఉపాధ్యాయుల నియామకం, ప్రమోషన్లు గత ప్రభుత్వం ఎందుకు వచ్చిన లొల్లి అని చేయలేదు. కానీ మనం ఎవరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేశామ‌న్నారు.

Also Read: Rashmika : టాలీవుడ్ హీరోతొనే రష్మిక పెళ్లి.. నిర్మాత చెప్పేశాడు..!

ఇంకా మాట్లాడుతూ.. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తా. మీరు నన్ను ఏవిధంగా అనుకుంటారో మిమ్మల్ని మీ కింది నాయకులు అలాగే అనుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా కీలకం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనే సమాచారం నా దగ్గర ఉంది. మార్పు కోసం మనకు ప్రజలు అధికారం ఇచ్చారు. మాట నిలబెట్టుకుందాం.. కష్టపడి పనిచేద్దాం. మరింత పట్టుదలగా పనిచేయండి. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు గుర్తించారు. ప్రభుత్వ ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నారు. సమస్యలను అధిగమించేందుకు బీఆర్ఎస్‌ దుష్పచారాన్ని తిప్పికొట్టండి. మ‌రింత చిత్తశుద్ధితో పనిచేద్దాం. లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయండి. ప్రతిఒక్కరు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం కీల‌క సూచ‌న‌లు చేశారు.