Students Tension: ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన పర్వం.. ఉద్రిక్తత

బాసర ట్రిపుల్‌ ఐటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యల పరిష్కారం కాకపోవడంతో విద్యార్థుల మళ్ళీ ఆందోళన బాట పట్టారు.

  • Written By:
  • Updated On - August 1, 2022 / 12:41 PM IST

బాసర ట్రిపుల్‌ ఐటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యల పరిష్కారం కాకపోవడంతో విద్యార్థుల మళ్ళీ ఆందోళన బాట పట్టారు. నిజానికి కొద్దిరోజుల క్రితం తీవ్రస్థాయిలో ఆందోళనలు జరగ్గా… తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో విరమించారు.

తాజాగా పుడ్ పాయిజన్ ఘటనతో మరోసారి ట్రిపుల్ ఐటీ వ్యవహరం చర్చనీయాశంమైంది. కలుషిత ఆహారం ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి నుంచీ భోజనం చేయని విద్యార్థులు.. ఉదయం టిఫిన్ కూడా చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు.జులై 24 నాటికి మెస్‌ల కోసం కొత్త టెండర్లు పిలుస్తామని అధికారులు చెప్పినా.. ఈ విషయంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నించారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని వీసీ చెప్పినప్పటికీ.. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని… కొత్త టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ కీలక నిర్ణయం తీసుకుంది.
తోటి విద్యార్ధులను అడ్డుకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది. షోకాజ్ నోటీసుల తర్వాత కూడా మారకపోతే సస్పెండ్‌ చేస్తామని ఇంఛార్జ్ వీసీ స్పష్టం చేశారు.

విద్యార్ధులు మెస్‌లు పరిశీలిస్తామంటే కుదరదనీ, ట్రిపుల్ ఐటీలో మెస్ స్కాంలు జరగలేదన్నారు. విద్యార్ధుల బీమా డబ్బులు ఎక్కడికీ పోలేదున్న ఆయన ఫాకల్టీ కూడా అదే మెస్‌లో భోజనం చేస్తున్నారని చెప్పారు. తాను కూడా అదే భోజనం తింటున్నానని ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జ్ వీసీ చెప్పుకొచ్చారు. మెస్‌లకు కూడా వార్డెన్‌లను నియమిస్తున్నామని తెలిపారు. ఇంఛార్జ్ వీసీ ప్రకటనతో సంతృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు వారితో పాటు దీక్షకు దిగుతామని హెచ్చరించారు. మంత్రి సబిత ఇంటి ముందు మౌనదీక్ష చేయాలని పేరెంట్స్ కమిటీ నిర్ణయించింది. వీసీ హామీలపై తమకు నమ్మకం లేదన్నారు. కాగా పేరెంట్స్ హెచ్చరికలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.