Secretariat : విద్యార్థుల అరెస్ట్‌ ఫై కేటీఆర్ ఆగ్రహం

నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు

  • Written By:
  • Publish Date - July 15, 2024 / 03:33 PM IST

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ముట్టడికి (CHalo ) నిరుద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, గ్రూప్‌ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్‌-1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో నిరుద్యోగులు, ఉద్యోగార్ధులు రాష్ట్ర సచివాలయం ముట్టడికి (Chalo Secretariat) పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో సచివాలయం వద్ద ఉద్రిక్తక కొనసాగుతున్నది. నిరుద్యోగుల సెక్రటేరియట్‌ ముట్టడి (Chalo Secretariat) పిలుపులో భాగంగా బీసీ జనసభ కార్యకర్తలు సచివాలయంలోకి చొచ్చుకెల్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరుద్యోగలు, జనసభ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడం తో పోలీసులు వారిని అదుపులోకి (Unemployed Illegal Arrest) తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్‌ సహా కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో డీఎస్సీని వాయిదా వేయాలని రాజారాం యాదవ్‌ డిమాండ్‌ చేశారు. డీఎస్సీని వాయిదావేయకపోతే సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక విద్యార్థుల అరెస్ట్ ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని నమ్మబలికిన సర్కార్ ఇప్పుడు వారిని గాలికి వదిలేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకురావటం, శాంతియుతంగా ఆందోళన చేయటం కూడా ఈ ప్రజాపాలన నిషేధమా అని కేటీఆర్ ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం అణిచివేత ధోరణిని సాగిస్తుందని ఇది ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించారు. పోలీసులు అరెస్ట్ చేసిన రాజారాం యాదవ్ సహా మిగతా విద్యార్థి నాయకులందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read Also : Nag Ashwin : నాగ్ అశ్విన్ నిజంగానే సందీప్ వంగని ట్రోల్ చేశాడా.. నెట్టింట ఫ్యాన్స్ వార్..

Follow us