Site icon HashtagU Telugu

Jitendhar Reddy: బండి సంజయ్ ముఖ్యమంత్రి అయ్యాకే ఏదైనా..!!

Jitendhar Reddy

Jitendhar Reddy

మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చివేస్తోంది. ఒకపార్టీ నుంచి మరోక పార్టీలోకి జంప్ అవుతున్నారు నేతలు. మొన్నటివరకు ఆకర్ష్ బీజేపీ హవా కొనసాగుతే…ఇప్పుడు సీఎ కేసీఆర్ రివర్స్ గేమ్ మొదలు పెట్టారు. బీజేపీ నుంచి కొందరు నేతలను టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ కారు ఎక్కారు. శుక్రవారం స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కూడా గులాబీ గూటికి చేరుకున్నారు. వారి బాటలోనే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై జితేందర్ రెడ్డి స్పందించారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బండి సంజయ్ ను ముఖ్యమంత్రిని చేశాకే ఏదైనా అంటూ ఘాటుగా స్పష్టం చేశారు.

నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. బీజేపీలో ఉంటా..నన్నెవరూ కొనలేరు. నా వెంట్రుకలు కొనేందుకు కూడా మీకు చేతకాదు. బీజేపీ దేశం కోసం ప్రజలకోసం పోరాడుతున్న పార్టీ. ఇలాంటి పార్టీని వదిలి తప్పు చేయను. రాజగోపాల్ రెడ్డిని 50వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారు. బండి సంజయ్ ను సీఎం చేస్తాం అంటూ వ్యాఖ్యానించారు జితేందర్ రెడ్డి.

భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి…బీజేపీలోచేరడంతో…అధికారపార్టీ అప్రమత్తమయ్యింది. మునుగోడు ఎన్నికల ప్రభావం పార్టీపై పడకూడదని…అక్కడి నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలను పార్టీకి ఆహ్వానించింది. మరికొంతమందిని కూడా టీఆరెస్ లో చేర్చుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.

Exit mobile version