Site icon HashtagU Telugu

Paddy Vigil:ఏపీ నుండి తెలంగాణకు వస్తోన్న వరిధాన్యం అడ్డుకుంటున్న అధికారులు

197299 Rto Check Post Imresizer

197299 Rto Check Post Imresizer

వరి కొనుగోళ్ల అంశంపై కేంద్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఎన్ని విమర్శలు చేసినా, ఎంత పోరాటం చేసినా రైతులు మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు.

కేంద్రం ధాన్యం కొనకపోవడంతో తెలంగాణలోని అన్ని మార్కెట్‌ యార్డులతో పాటు జాతీయ రహదారులపై కూడా వరి ధాన్యం కనిపిస్తోంది. తమ ధాన్యం వర్షాలకు తడుస్తోందని, కొనమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా హాప్ లెస్ గానే కన్పిస్తోంది.

మరోపక్క పక్కనే ఉన్న ఏపీ నుండి కూడా తెలంగాణలోకి వరి ధాన్యాన్ని తరలిస్తున్నారట. ఏపీ నుండి వస్తున్న లారీలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోనే అధికారులు అడ్డుకుంటున్నారు.

తెలంగాణ ఏపీ బోర్డర్స్ లో నుండి వస్తోన్న ఏపీ వరి ధాన్యం లారీ లోడ్ లను అధికారులు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు.
ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన వ్యాపారులు దాన్ని తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొస్తున్న తరుణంలో అధికారులు గుర్తించి అడ్డుకుంటున్నారు. ఏపీతో సహా మిగతా రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని, ఇలాంటి వాటిని గుర్తించడానికి బోర్డర్స్ లో నిఘా పెంచామని అధికారులు తెలిపారు.