Hyderabad : చెస్ట్ హాస్పిటల్లో వీధి కుక్కల స్వైర విహారం…మెడికోపై దాడి..!!

హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో వీధికుక్కలు స్వైర విహారం చేశాయి.

Published By: HashtagU Telugu Desk
Govt Bans Dogs

Dogs

హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. మంగళవారం తెల్లవారుజామున రోగులను చూసేందుకు వెళ్తున్న మెడికో పై 11 వీధికుక్కల గుంపు దాడి చేసింది. కుక్కల దాడిలో వైద్య విద్యార్థిని చేతులు, కాళ్లు, ఇతర శరీర భాగాలపై గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోని క్యాజువాలిటీకి తరలించారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో విద్యార్థిని ఆసుపత్రి భవనం వైపు వెళ్తుండగా కుక్కలు ఆమెపై దాడి చేశాయి. ఆమె అరుపులు విన్న ఆసుపత్రి సిబ్బంది..రోగుల సహాయకులు ఆమెను రక్షించారు.

ఉస్మానియా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జుడా) డైరెక్టర్ డాక్టర్ ఎస్. శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..గత కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఘటన జరిగినట్లు చెప్పారు. ఆసుపత్రికి ఒంటరిగా రావాలంటే వైద్య సిబ్బంది భయపడుతున్నారన్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

  Last Updated: 21 Sep 2022, 09:16 AM IST