Site icon HashtagU Telugu

Hyderabad: ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి

Hyderabad

Hyderabad

Hyderabad: తెలంగాణలో కుక్కల బెడద ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో కుక్కలా దాడి కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు పొయ్యాయి. ముఖ్యంగా చిన్నారుల్ని బయటకు పంపించాలి అంటేనే తల్లి దండ్రులు వణిపోతున్నారు. తాజాగా తెలంగాణలో మరో ఘటన వెలుగు చూసింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి

సంగారెడ్డిలోని శ్రీనగర్ కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. మొత్తం ఆరు కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. వెంటనే స్థానికులు అతడిని రక్షించారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బాలుడి ఏడుపు విన్న స్థానికులు చిన్నారిని రక్షించడం చూడవచ్చు. కాగా ప్రాణాలతో బయటపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రాష్ట్రలో ఇలాంటి వరుస ఘటనలపై అధికారుల చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో చిన్న పిల్లలపై వీధికుక్కల దాడులు పునరావృతమవుతున్న ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. వీధికుక్కల బెడద కారణంగా ప్రాణాలు కోల్పోవడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర పరిపాలనా ప్రయత్నాల ప్రభావాన్ని ప్రశ్నించింది. వీధికుక్కల నివారణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని మున్సిపల్, రెవెన్యూ, వెటర్నరీ అధికారులను కోర్టు ఆదేశించింది.

ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో వీధికుక్కల దాడులకు చిన్నారులు బలి అవుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో షేక్‌పేట పరిధిలోని వినోబా నగర్‌లో ఐదు నెలల పాప మృతి చెందింది. ఫిబ్రవరి 2024లో హైదరాబాద్‌లో వీధికుక్క దాడికి ఏడాది వయసున్న మరో చిన్నారి బలైంది.ఈ ఘటన శంషాబాద్‌లో చోటుచేసుకుంది. 2024 తెలంగాణలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read: Rashmika Mandanna : ఏదేమైనా డిమాండ్ అంటే రష్మికదే..!