Protest On Jupalli : గద్వాల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి జూపల్లికి…సొంత పార్టీ నేతల నుంచే చేదు అనుభవం ఎదురైంది. అయితే…రిజర్వాయర్ల పర్యటనలో భాగంగా వెళ్తున్న జూపల్లిని లోకల్ కాంగ్రెస్ నాయకులు అడ్డగించారు. జూపల్లి డౌన్ డౌన్ అనడమే కాకుండా…ఏకంగా రాళ్ల దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీంతో ఎలర్ట్ అయిన పోలీసులు..కాంగ్రెస్ నాయకులును చల్లబర్చారు.
అయితే…జూపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని జాయిన్ చేసుకున్నందుకు నిరసనగా సరితా వర్గీయులు దాడి చేసారు. అయితే…నిరసనకు దిగిన సరితను పరామర్శించేందుకు ఇంటికి వెళ్తున్న జూపల్లి కారులో నుంచి ఎమ్మెల్యే దిగిపోయాడు. దీంతో గద్వాల జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
వాస్తవానికి…ఎమ్మెల్యే బండ్లను కాంగ్రెస్‌లోకి జాయిన్ అవ్వకుండా ఉండాలని సరితా వర్గం ఎప్పటి నుంచో అడ్డుకుంటోంది. అయితే ఎమ్మెల్యే బండ్ల కూడా జూపల్లితో ఎంతో రాయభారం నడిపించారు. ఈ సమయంలోనే…సరితా కూడా కాంగ్రెస్ పెద్దలను ఎంతో మందిని కలిసి…ఎమ్మెల్యే బండ్లను కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దని ఎంతో అభ్యర్ధించింది. అయినా సరే…సరితను బుజ్జగించి రేవంత్ కండువా కప్పేసారు.
అనంతరం బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో…కేటీఆర్ ఛాంబర్‌లో ఎమ్మెల్యే బండ్ల ప్రత్యక్షం అవ్వడం…తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. మంత్రి జూపల్లి ఒక్కరోజు తిరగకుండానే బండ్ల ఇంటికి వెళ్లి…సర్దిచెప్పి హామీలిచ్చి సీఎం రేవంత్‌తో భేటీ అయ్యేలా ప్లాన్ చేసారు. ఎమ్మెల్యే బండ్ల.. కాంగ్రెస్‌లో కొనసాగుతారని తేల్చి చెప్పారు. ఇలాంటి నేపధ్యంలో…గద్వాల పర్యటనలో ఉన్న జూపల్లిని…స్థానిక కాంగ్రెస్ నేతలు, నాయకులు జీర్ణించుకోలేక మంత్రి మీద తిరగబడ్డారు.