Site icon HashtagU Telugu

Hyderabad: దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరు: ఖర్గే

Hyderabad

Hyderabad

Hyderabad:  దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన ప్రాన్‌ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ రోజు గురువారం హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో జరిగిన పార్టీ ‘బూత్ లెవల్ ఏజెంట్స్’ సమావేశంలో ఖర్గే ప్రసంగించారు. ఖర్గే మాట్లాడుతూ బిజెపి నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.మనుషులకు దేవుడి ఫోటోలు చూపించి కడుపు నిండదు. సంక్షోభం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్, చైనా, దేవుడు వంటి సాకులు చెప్పడం ఆయనకు అలవాటని మోడీపై మంది పడ్డారు. అతని ఉచ్చులో చిక్కుకోవద్దు. మోడీ ఉచ్చులో ప్రజలు చిక్కుకుంటే దేశంలో ప్రజాస్వామ్యం అంతం అవుతుంది అని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసిందని, కార్యకర్తల కృషి వల్లే విజయం సాధించిందని ఏఐసీసీ చీఫ్ అన్నారు. మన కృషితో తెలంగాణను మోడల్‌గా మార్చాలి. దేశంలోని మిగిలిన ప్రభుత్వాలు ఈ నమూనాను ఆదర్శంగా తీసుకొని ఈ పాలనను అనుసరిస్తాయి అని ఆయన అన్నారు. సభ అనంతరం కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి పార్టీ శ్రేణులకు ఖర్గే పలు సూచనలు ఇచ్చారు.

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. బూత్ లెవెల్ కమిటీలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేసేందుకు ప్రణాళిక వేసుకుంది. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరాన్ని గురించి ప్రజలకు వివరించాలని ఈ ప్రణాళికలతో ముందుకెళ్లనున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఖర్గే నగరానికి వచ్చారు.

Also Read: Raviteja Mister Bacchan : మిస్టర్ బచ్చన్ మల్టీస్టారర్.. రవితేజతో ఆ హీరో స్క్రీన్ షేరింగ్..?