Site icon HashtagU Telugu

Stanford University : తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పనిచేయబోతున్న స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ

Stanford's Byers Center

Stanford's Byers Center

రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకురావడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth US Tour) ..వరుస సమావేశాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. ఇప్పటికే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దీనికి సంబదించిన ఒప్పందులు కూడా చేసుకోవడం జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్, నెట్ జీరో, ప్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్ ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి బృందం చర్చించింది. అంతేకాకుండా నగరంలో పెట్టుబడులు పెడితే సదరు సంస్థలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుందో చెప్తూ వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ (Stanford University) ముందుకు వచ్చింది. స్టాన్ పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ తో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. తెలంగాణలో స్టాన్‌ ఫోర్డ్ బయోడిజైన్ శాటి లైట్ సెంటర్‌ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. స్టాన్‌ఫోర్డ్ అధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకడమిక్, హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలని తన ఆలోచనలను సీఎం వారితో పంచుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ ప్రకటించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… స్టాన్ ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవటం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుందన్నారు. హెల్త్ కేర్ రంగంలో యువతకు నైపుణ్యాల అభివృద్ధిని అందించేందుకు స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యం కోరినట్లు తెలిపారు. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే స్కిల్స్ డెవెలప్మెంట్ లో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్యం ఒక్క తెలంగాణ వృద్ధికే కాకుండా.. యావత్ ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుందని అన్నారు.

Read Also : Anantnag Encounter: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులకు గాయాలు