Munugode Counting: మునుగోడు కౌంటింగ్ కు సర్వం సిద్ధం!

మరో 24 గంటల్లో మునుగోడు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.

  • Written By:
  • Updated On - November 5, 2022 / 05:54 PM IST

మరికొద్ది గంటల్లో మునుగోడు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. దీనికోసం అధికారులు నల్గొండలోని ఆర్జాలబావి సమీపంలోని ఎఫ్సీఐ గోదాంలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. మునుగోడు నుంచి చివరి ఈవీఎం శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్స్ కు చేరింది. తెల్లవారుజామున 4.40 గంటలకు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్రూమ్ ను సీజ్ చేశారు. తర్వాత నుంచి కౌటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు.

ఇందుకోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్ట్రాంగ్‌రూం వద్ద ప్రత్యేక బలగాలతో మూడంచెలుగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. 298 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు కోసం నల్గొండ పట్టణంలోని అర్జాలబావిలో ఉన్న వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 21 టేబుల్స్ పై15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను ఓపెన్ చేసి,పోలైన 686 పోస్టల్ బ్యాలట్ ఓట్లను కౌంట్ చేస్తారు. తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, 9 గంటలకు తొలి ఫలితం వెలువడనుంది.

అభ్యర్థుల భవితవ్యం మాత్రం ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది. 6నబాక్స్‌లు తెరిచాక ఎవరి భవితవ్యం ఏంటో తెలియనుంది. కౌంటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్‌ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. ఏజెంట్లు, సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత, ఈసీ ఇచ్చిన గుర్తింపు కార్డులను చూపితేనే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు. పోలింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూంలను ఓపెన్‌ చేసి పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు.