Site icon HashtagU Telugu

ఇంకొన్ని గంటల్లో ఉపఎన్నికల ఫలితాలు, ఫలితాల కోసం వారి ఎదురుచూపు. ఎందుకంటే…

ఎన్నికల కోసం విసురుకున్న సవాళ్లు, ప్రజలు తమనే గెలిపిస్తారని నమ్మకాలు, నియోజకవర్గంలో తమ జెండానే ఎగురుతుందనే ఆశలు ముగిసాయి. ఇక తేలాల్సింది ఫలితాలే.

ఇంకా కొన్ని గంటల్లోనే ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. హుజురాబాద్లో 86.64 శాతం ఓట్లు పోలవడంతో పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి కలిసొస్తుందని రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

గతంలో ఉప ఎన్నికల్లో ఎప్పుడూ ఈ స్థాయిలో పోలింగ్‌ నమోదు కాలేదు. కొన్ని గ్రామాల్లో 90 శాతంపైగా పలింగ్‌ నమోదవడం విశేషం. రాష్ట్ర రాజకీయాలకు, వచ్చే ఎన్నికలకు ఈ ఉపఎన్నిక ఫలితాలను ముడిపెట్టడంతో అంతా ఒక్కసారిగా హుజురాబాద్‌ వైపు చూడటం ప్రారంభించారు.
దానితో పాటు కేసీఆర్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈటెల, ఆయనపైనే తిరుగుబాటు చేయడంతో ee ఎన్నికల్లో ఎవరేంటో తేలనున్న నేపథ్యంలో ఇరువురికి, ఇరువురి మద్దతుదారులకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఈ మధ్యే నూతన నాయకత్వంతో పుంజుకుంటున్న కాంగ్రేస్ కి కూడా ఈ ఎన్నిక ఫలితం అవసరమే. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలై 22 రౌండ్ల లెక్కింపు తర్వాత అధికారికంగా గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తారు.ఎక్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నా ఏం జరుగుతుందో రేపు తేలనుంది.

ఇక ఏపీలోని కడప జిల్లా బద్వేల్ లో మొన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై పెద్ద చర్చ లేకపోయినా మెజార్టీపై చర్చ జరుగుతోంది. అధికారపార్టీ అభ్యర్థే అక్కడ గెలుస్తారు. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకవపోవడం, జనసేన కూడా తమ అభ్యర్థిని బరిలో నిలబెట్టకపోవడంతో ఆ రెండు పార్టీల ఓట్లు తమకు పడితే క్యాడర్ లో ఉత్సాహం వస్తుందని బీజేపీ ఆశపడుతోంది. బీజేపీ నాయకుల ఆశలు ఏమవుతాయో రేపు తెలుస్తుంది.

Exit mobile version