MLC Kavitha: గిరిజన కోటా 10 శాతం.. ఎస్టీలకు కేసీఆర్‌ దసరా కానుక!

Mlc Kavitha: గిరిజన రిజర్వేషన్లపై దాదాపు నాలుగు సంవత్సరాల క్రిందట అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా స్పందించలేదన్న ఎమ్మెల్సీ కవిత, దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు అమలు చేసేందుకు జోవో విడుదల చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

  • Written By:
  • Updated On - October 1, 2022 / 11:39 PM IST

Mlc Kavitha: గిరిజన రిజర్వేషన్లపై దాదాపు నాలుగు సంవత్సరాల క్రిందట అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా స్పందించలేదన్న ఎమ్మెల్సీ కవిత, దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు అమలు చేసేందుకు జోవో విడుదల చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నారాయన్ ఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలంలోని బల్కంచెల్క తండాలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

జాతిని మొత్తం జాగృతం చేసి, ఎలా ముందడుగు వేయాలో చెప్పిన మహనీయుడు సేవాలాల్ అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సేవాలాల్ కు భారత రత్న ఇవ్వాలని 2016-17 లో పార్లమెంటులో డిమాండ్ చేసానన్నారు ఎమ్మెల్సీ కవిత. భారతదేశంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు రూ.10 లక్షలు కేటాయిస్తూ సేవాలాల్ జయంతిని నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గారు 84 కులాలకు హైదరాబాద్ లో ఆత్మ గౌరవ భవనాలు ఇచ్చారన్న ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ లో గిరిజన భవనాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రారంభించారన్నారు.

కళ్యాణ లక్ష్మి పుట్టిందే గిరిజన తండాలో

కల్యాణ లక్ష్మి పథకం పుట్టిందే గిరిజన తండాలో అన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ఉద్యమ సమయం నాటి అనుభవాల నుండి సీఎం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 3 వేలకు పైగా గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చమని, కోటికి పైగా మహిళలకు బతుకమ్మ చీరలు అందించామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సంపద ‌పెంచాలి, ప్రజలకు పంచాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. వాట్సాప్ యూనివర్సిటీలలో వచ్చే తప్పుడు ప్రచారాలపై జాగ్రత్తగా ఉండాలని , ప్రజలకు మంచి చేసే నాయకులను గుర్తించాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తీజ్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించే అంశాన్ని ‌సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

అనంతరం వేలాది మంది గిరిజన ఆడబిడ్డలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, తెలంగాణ స్టేట్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతా ప్రభాకర్ , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి , అందొల్ ఎమ్మెల్యే గారి సతీమణి పద్మావతి క్రాంతి కిరణ్ , జాగృతి రాష్ట్ర కార్యదర్శి మఠం బిక్షపతి పాల్గొన్నారు.