తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో ఫ్రెంచ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) సూచించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ‘ఇండో-ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (IFCCI)’ ప్రతినిధులతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ 30వేల ఎకరాల్లో నిర్మించబడుతున్న ఈ మెగా ప్రాజెక్టు కేవలం నగరంగా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలవనుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ప్రకారం, పీపీపీ మోడల్‌లో అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు.
Nabha Natesh : నభా..అబ్బబ్బా! టెమ్ట్ చేస్తోన్న కన్నడ భామ
ఇప్పటికే ఏడాదిన్నర వ్యవధిలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాగలిగినట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది హైదరాబాద్‌లో 70 జీ.సి.సీలు స్థాపించబడినదే రాష్ట్రంపై పారిశ్రామికవేత్తల నమ్మకానికి నిదర్శనమన్నారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు, ప్రతిభావంతులైన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అనుమతుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడం కోసం TG-iPASS వ్యవస్థను ఏఐతో అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. పారదర్శకత, వేగం, నిబద్ధతతో పారిశ్రామిక వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Operation Sindhu : ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 380 మంది భారతీయులు
ఫార్మా, ఐటీ, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఇప్పటికే ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. సనోఫీ, డసాల్ట్, మోనిన్, క్యాప్ జెమినీ, సఫ్రాన్ వంటి కంపెనీలు ఇప్పటికే రాష్ట్రంలో తమ ఉనికిని చాటాయని గుర్తుచేశారు. డిజిటల్ గవర్నెన్స్, క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ హెల్త్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులకూ అవకాశాలున్నాయని అన్నారు. తెలంగాణ–ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.