Site icon HashtagU Telugu

Sri Rama Navami : శోభాయాత్ర వేళ రాజాసింగ్ కు పోలీస్ షాక్‌

Sri Rama Navami

Sri Rama Navami

అంగ‌రంగ వైభ‌వంగా శ్రీరాముని శోభాయాత్ర(Sri Rama Navami) జరుగుతోన్న స‌మ‌యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ముంబాయ్ పోలీసులు(Mumbai police) జ‌ల‌క్ ఇచ్చారు. ద్వేష‌పూరిత ప్ర‌సంగం చేసిన పాత స‌భ‌ల్లోని వ్యాఖ్య‌ల‌ను ఉటంకిస్తూ భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 153-ఎ (1) (ఎ) కింద దాదర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. జనవరి 29న ముంబైలో హిందూ సకల్ సమాజ్ మోర్చా స‌భ‌లో ఆయ‌న ద్వేష‌పూరిత ప్ర‌సంగం చేశారని అభియోగం మోపారు. దాదాపు రెండు నెలల తర్వాత పోలీసులు రాజా సింగ్‌పై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు.

అంగ‌రంగ వైభ‌వంగా శ్రీరాముని శోభాయాత్ర(Sri Rama Navami)

ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ మేర‌కు రాజాసింగ్ ఆధ్వ‌ర్యంలో శోభాయాత్ర(Sri Rama Navami) అంగ‌రంగ వైభ‌వంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో కొన‌సాగుతోంది. భారీగా మోహ‌రించిన పోలీసుల భద్రత న‌డుమ యాత్ర జ‌రుగుతోంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అప్ర‌మ‌త్తం అయింది. సీతారామ్ బాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శ్రీరాముడి శోభాయాత్ర రూట్ ఉంది. బోయగూడ కమాన్, మంగళ్ హాట్ జాలి హనుమాన్, దూల్ పేట, పురానాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్ధంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ కోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుల్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకునేలా బ్లూ ప్రింట్ ఉంది.

భారీగా మోహ‌రించిన పోలీసుల భద్రత

సీసీ కెమెరా, పోలీస్ నిఘా నీడలో ఈ ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి పరిస్థితిని పోలీసు అధికారులు పర్యవేక్షించనున్నారు. శోభాయత్ర రూట్ మ్యాప్ లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు, పలు మళ్లింపులు అమల్లో ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు బోయిగూడ కమాన్, గౌలిపుర చౌరస్తా, ఘోడే కి ఖబర్ ప్రాంతాల్లో యాత్ర ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 5 వరకు పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జ్, లేబర్ అడ్డా వ‌ర‌కు ప్లాన్ చేశారు. ఇక సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అలాస్కా టీ జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్ వ‌ర‌కు యాత్ర కొన‌సాగుతోంది. సాయంత్రం 4 నుంచి 6 వరకు అఫ్జల్ గంజ్ జంక్షన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Also Read : Sri Rama Navami 2023: నేడు శ్రీరామ నవమి 2023 శుభ సమయం, పూజా విధానం, విశిష్టత ఇలా..!

సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు రంగమహల్ టీ జంక్షన్, పుత్లీబౌలి చౌరస్తా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ ఘాట్ చౌరస్తా, రాత్రి 7 నుంచి 9 వరకు కాచిగూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బొగ్గులకుంట చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు అమ‌లు కానున్నాయి. వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. టెన్ష‌న్ నడుమ మ‌ధ్యాహ్నాం శ్రీరాముని శోభాయాత్ర ప్రారంభం అయింది. గ‌త ఏడాది శోభాయాత్ర (Sri Rama Navami) సంద‌ర్భంగా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌ను ఎమ్మెల్యే రాజాసింగ్ చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్న కేసీఆర్ స‌ర్కార్ ఆయ‌న మీద కేసు పెట్టింది. జైలు కూడా పంపింది. దీంతో బీజేపీ ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. గ‌త కొన్ని రోజులుగా బీజేపీతోనూ దూరంగా ఉంటున్నారు. అయితే, శోభాయాత్ర‌ను మాత్రం ఆయ‌న లీడ్ చేస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో ముంబాయ్ పోలీసులు(Mumbai police) నోటీసులు జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

 Also Read : Srirama Yatra : రామ‌రామా, శోభాయాత్ర‌కు రాజాసింగ్ రంగు