Eatala invites Sravani: ఈటల స్కెచ్.. బీజేపీలో చేరికకు శ్రావణికి గ్రీన్ సిగ్నల్!

బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మరుసటి బోగ శ్రావణి బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు ఈటల.

  • Written By:
  • Updated On - February 25, 2023 / 01:03 PM IST

ఒకవైపు బీఆర్ఎస్ (BRS Party) పార్టీ దేశ రాజకీయాలపై ఆసక్తి చూపుతూ.. పార్టీ విస్తరణపై ద్రుష్టి సారిస్తుంటే.. మరోవైపు ఆ పార్టీలోని అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ గ్రూప్ విభేదాలపై ఇతర పార్టీలు గురి పెడుతున్నాయి. బయటకొచ్చిన నేతలంతా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajendar) తో టచ్ లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మరుసటి రోజు జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బోగ శ్రావణి బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు ఈటల. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అయిన ఈటల రాజేందర్ (Etala Rajendar) జగిత్యాలలోని ఆమె నివాసంలో ఆమెను కలుసుకున్నారు.

శ్రావణి (Sravani)కి సంఘీభావం తెలిపి బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. అసెంబ్లీ పవిత్ర స్థలమని, బీఆర్‌ఎస్ డర్టీ పాలిటిక్స్ కు పాల్పడుతోందని రాజేందర్ అన్నారు. కేసీఆర్ హయాంలో వెనుకబడిన, ఎస్సీ వర్గాలకే కాదు, సొంత పార్టీ నేతలకు కూడా అన్యాయం జరిగిందని ఆరోపించారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ గొడవే అందుకు చక్కటి ఉదాహరణ అని అన్నారు. అధికార పార్టీ నాయకులు కేవలం సీఎంను పొగడడానికే ఉన్నారని, ప్రజా సమస్యలను వినే స్థితిలో లేరని రాజేందర్ (Etala Rajendar) అన్నారు. బీజేపీలో చేరాల్సిందిగా శ్రావణిని కూడా ఆహ్వానించారు. మీడియాతో మాట్లాడిన శ్రావణి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

Also Read: RRR Roars: దుమ్మురేపుతున్న ఆర్ఆర్ఆర్.. హాలీవుడ్ ను వెనక్కి నెట్టి, 5 అవార్డులను కొల్లగొట్టి!