నిత్యం రోడ్డు ప్రమాదాలను హడలెత్తిస్తున్నాయి. ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి…తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేవరకు టెన్షనే. మనం జాగ్రత్తగా వెళ్లినప్పటికీ అవతలి వ్యక్తి ఎలా వస్తున్నాడో అర్ధం కానీ పరిస్థితి. ముఖ్యంగా మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం..నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం..ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేయడం వల్ల అమాయకపు ప్రాణాలు గాల్లొకలుస్తున్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతుండగా..తాజాగా ఖమ్మం-సూర్యాపేట రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమండంలో తల్లిదండ్రులు కన్నుమూయగా..ఇద్దరు పిల్లలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. సెప్టెంబర్ 29న సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Perni Nani : హరీష్ రావు..చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం ఫై పేర్ని నాని కామెంట్స్
సూర్యాపేట జిల్లా మునగాల మండలం వెంకట్రామాపురం శివారు ఎస్‌ఎం పేటకు చెందిన మదనపల్లి సంతోష్ రావు సెప్టెంబర్ 27న ఉదయం తన భార్య, పిల్లలతో కలిసి ఖమ్మంలో తన పెద్దనాన్న అంత్యక్రియలకు వెళ్లారు. అంతిమ సంస్కారాలు, మూడో రోజు సంస్కారాలు ముగిసిన తర్వాత శుక్రవారం సాయంత్రం తన కారులో తిరిగి ఇంటికి బయల్దేరారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు ఓ మలుపు వద్ద అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టి బోల్తాపడింది. సంతోష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్యతో పాటు పిల్లలు యోజిత, గగన, సంతోష్ సోదరుడి పిల్లలు హేమలతశ్రీ, కోమల్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ భార్య మృతి చెందింది. పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఖమ్మం జాతీయ రహదారిపై కారు ఏక్సిడెంట్లో భార్య, భర్త మృతి#IndraSenaReddy #traffic #highways pic.twitter.com/Hmb0nJDJFC
— M.INDRASENAREDDY (@indrasena9966) October 1, 2023